జుట్టు ఊడకుండా ఉండాలంటే ఏం చేయాలి..?  

సాక్షి లైఫ్ : ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సులభమైన పద్ధతుల్లో ఆరోగ్యకరమైన చిట్కాలను అనుసరిస్తే కొన్నిరకాల అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు. ఎలాంటి హానిలేని ఉత్తమ చిట్కాలు అందించే ఆరోగ్య నిపుణుల సలహాలను పాటిస్తే ఆయా సమస్యలకు సరైన పరిష్కారాలు పొందవచ్చు. వైద్య నిపుణులు అందించిన కొన్ని చిట్కాలు..ఉన్నాయి.  

జుట్టురాలకుండా ఉండడానికి.. 

-ఇరవై తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టుచేయాలి. 

-ఈ పేస్టులో టీస్పూను నెయ్యి వేసి కలపాలి.

-ఆ మిశ్రమాన్ని మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. 
గంట తరువాత నీటితో కడిగేయాలి. 

-ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్‌ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది.

 -జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.  

-అలాగే తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్‌ చేసితే  జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది.

-ఈ విధంగా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : healthy-hair

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com