AQI : గాలి కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి.. ఏక్యూఐ పెరిగితే శరీరంలో జరిగే మార్పులివే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దీపావళికి ముందే ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. గాలి నాణ్యత సూచీ (AQI) 201-300 మధ్యకు పడిపోవడంతో, కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు 'గ్రాప్-1' GRAP-1 - గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. గాలిలో కాలుష్యం పెరిగినప్పుడు అది కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా కళ్లు, ముక్కు, గుండె ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. కలుషిత గాలి పీల్చినప్పుడు శరీరంలో కనిపించే తొలి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

తొలి దశలో కనిపించే లక్షణాలు..

కలుషిత గాలి బారిన పడిన వెంటనే శ్వాసకోశంలో వాపు, మంట మొదలవుతాయి. శరీరంలో ప్రధానంగా ఈ కింది మార్పులు కనిపిస్తాయి. కళ్లలో మంట, కళ్లు ఎర్రబడటం, నీరు కారడం. ముక్కు కారడం, గొంతులో గరగర, తరచుగా తుమ్ములు రావడం. పొడి దగ్గు లేదా గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం. తీవ్రమైన తలనొప్పి, నీరసంగా అనిపించడం. కాలుష్యం వల్ల ఎముకలకూ నష్టం వాటిల్లుతుందని తాజా ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి.

ఊపిరితిత్తులు, గుండెపై తీవ్ర ప్రభావం..

గాలిలోని పీఎం 10 (PM 10), పీఎం 2.5 (PM 2.5) లాంటి కాలుష్య కణాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. పీఎం 2.5 కణాలు అతి సూక్ష్మంగా ఉండటం వల్ల అవి ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి, నేరుగా రక్తంలో కలిసిపోతాయి. అప్పటికే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఉబ్బసం ఎటాక్ రావడం, శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలు (Wheezing) రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలం పాటు ఈ కాలుష్య వాతావరణంలో గడిపితే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా, భవిష్యత్తులో గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఎవరికి ముప్పు ఎక్కువ..?

చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అప్పటికే గుండె, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారిపై ఈ వాయు కాలుష్య ప్రభావం చాలా వేగంగా, తీవ్రంగా ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

బయటకు వెళ్లే ముందు మీ ప్రాంతంలో ఏక్యూఐ (AQI) ఎంతుందో యాప్స్ ద్వారా చెక్ చేసుకోండి. కాలుష్యం ఎక్కువగా ఉంటే ఆరుబయట వ్యాయామాలు, మార్నింగ్ వాక్ తగ్గించండి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ముఖానికి సరిగ్గా సరిపోయే నాణ్యమైన 'ఎన్-95' (N-95) మాస్క్‌ను ధరించండి.
ఇంట్లో చెత్తను కాల్చడం, పొగ రావడం వంటివి నివారించండి. వాతావరణం మరీ ఇబ్బందికరంగా ఉంటే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడటం ఉత్తమం. ఆస్తమా రోగులు తమ ఇన్ హేలర్లు, రోజువారీ మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. నిపుణులైన వైద్యుల సలహాతో ముందుజాగ్రత్త చర్యలు పాటించాలి.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.