Shamonda Virus : వణికిస్తున్న మరో ప్రాణాంతక వైరస్.. ఫ్రాన్స్‌లో 'షామోండా వైరస్'తో తొలిసారి మృతి కేసు నమోదు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులు జూనోటిక్ డిసీజెస్ (Zoonotic diseases).. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా, పశువుల్లో మాత్రమే కనిపించే 'షామోండా వైరస్' (Shamonda virus) కారణంగా ఫ్రాన్స్‌లో ఓ 60 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోవడం వైద్య లోకాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మనుషుల్లో ఈ వైరస్ సోకి మరణించినట్లు నమోదు కావడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

అసలేంటి ఈ షామోండా వైరస్..? ఎలా వ్యాపించింది..?

ఈ వైరస్ ప్రధానంగా ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాల్లో కనిపిస్తుంది. జులై నుంచి యూరప్‌లోని పలు దేశాల్లో పశువుల్లో ఈ కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్‌లో మరణించిన వ్యక్తికి 'మిడ్జ్' (Midge) అనే ఒక చిన్న కీటకం కుట్టడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. మరణించిన వృద్ధుడిలో రోగనిరోధక శక్తి (Immunity) ముందే చాలా బలహీనంగా ఉందని, నాడీ వ్యవస్థ సమస్యలతో ఆసుపత్రిలో చేరాడని అధికారులు తెలిపారు.

 భయపడాలా అంటే..?

సాధారణ ప్రజలు దీని గురించి ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన వైరాలజీ నిపుణులు డాక్టర్ బెన్ బ్రెన్నాన్ స్పష్టం చేశారు. రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించిన వారిలోనే ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ఆరోగ్యవంతులకు ముప్పు లేదని ఆయన వివరించారు.

మనిషి నుంచి మరో మనిషికి

అలాగే, ఈ వైరస్ ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపించే ప్రమాదం (Human-to-human transmission) దాదాపు లేనట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇది ఒక అరుదైన కేసుగా పరిగణిస్తున్నప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC) ఈ వైరస్ వ్యాప్తిపై నిశితంగా నిఘా ఉంచాయి. పశువుల్లో వ్యాపించే ఇలాంటి కొత్త ఇన్ఫెక్షన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం భవిష్యత్తు ముప్పులను అడ్డుకోవడానికి ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.