Eye Burning : మొబైల్ చూస్తే కళ్లలో మంట.. కారణం ఏమిటంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం నిద్రలేవగానే కళ్లు బరువుగా అనిపించడం, మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ముందు కూర్చోగానే మంటలు, బయట నుంచి రాగానే కళ్లు ఎర్రబడటం.. ఇవన్నీ మీ దినచర్యలో భాగమయ్యాయా..? ప్రస్తుత డిజిటల్ యుగంలో స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కళ్లపై ఒత్తిడి పడటం సహజమే. కానీ, ప్రతిసారీ దీనికి మొబైల్, కంప్యూటర్లే కారణం కాకపోవచ్చు. మన కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇతర ముఖ్య కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

కళ్లు పొడిబారడం (Dry Eyes)..

కళ్లలో మంట, దురదకు ప్రధాన కారణం కళ్లు పొడిబారడం. కంటి ఉపరితలంపై ఉండే పలుచటి కన్నీటి పొర కళ్లను ఎప్పుడూ తేమగా ఉంచుతుంది. కన్నీరు తగినంత ఉత్పత్తి కాకపోయినా, త్వరగా ఆవిరైపోయినా ఈ సమస్య వస్తుంది. థైరాయిడ్, విటమిన్-ఎ లోపం, మెనోపాజ్ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు కూడా దీనికి కారణం కావచ్చు.

అలర్జీలు, ఇన్ఫెక్షన్లు (Allergies and Infections)..

దుమ్ము, పుప్పొడి, పెంపుడు జంతువుల రోమాల వల్ల కళ్లలో అలర్జీలు వస్తాయి. దీనివల్ల కళ్లు ఎర్రబడటం, నీరు కారడం జరుగుతుంది. బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కళ్లలో మంట వస్తుంది. ఇలాంటప్పుడు కళ్లను పదే పదే చేతులతో నలపకూడదు.

పవర్ లేని కళ్లద్దాలు, మందుల దుష్ప్రభావం..

కంటి చూపునకు సరిపడని పాత కళ్లద్దాలు వాడటం వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడి తలనొప్పి వస్తుంది. కాంటాక్ట్ లెన్స్‌లు ఎక్కువసేపు పెట్టుకోవడం, శుభ్రత పాటించకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. అంతేకాదు, బీపీ, డిప్రెషన్, అలర్జీలకు వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా కళ్లు పొడిబారుతాయి. నిద్రలేమి, ధూమపానం, నాసిరకం ఐ-మేకప్ ఉత్పత్తులు కంటికి హానికరం.

కంటికి మేలు చేసే పోషకాలు..

కంటి చూపు మెరుగుపడటానికి విటమిన్-ఎ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. క్యారెట్, బొప్పాయి, వాల్‌నట్స్, అవిసె గింజలు, ఆకుకూరలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కంటికి అవసరమైన పోషకాలు అందుతాయి.

జాగ్రత్తలు..

కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజంతా తగినంత నీరు తాగాలి. నిద్రపోయేటప్పుడు ఏసీ లేదా ఫ్యాన్ గాలి నేరుగా ముఖంపై కళ్లపై పడకుండా చూసుకోవాలి. రోజుకు రెండుసార్లు చల్లటి, శుభ్రమైన నీటితో కళ్లు కడుక్కోవాలి. మురికి చేతులతో కళ్లను తాకకూడదు. ఎండ, దుమ్ము నుంచి రక్షణకు బయటకు వెళ్లినప్పుడు యూవీ ప్రొటెక్షన్ సన్‌గ్లాసెస్ వాడాలి. టూవీలర్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. చదివేటప్పుడు లేదా ల్యాప్‌టాప్‌పై పనిచేసేటప్పుడు గదిలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. కళ్లలో నొప్పి, వాపు, తీవ్రమైన మంట ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆప్తాల్మాలజిస్ట్ లను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.