సాక్షి లైఫ్ : అధిక బరువుతో బాధపడుతున్న సామాన్యులకు ఊరటని చ్చేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇండోర్ లో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎంవై (MY) ఆసుపత్రిలో 'బేరియాట్రిక్, మెటబాలిక్ క్లినిక్'ను ప్రారంభించారు. ప్రభుత్వ రంగంలో ఇటువంటి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. దీనివల్ల నిరుపేదలకు లక్షల రూపాయల ఖరీదైన శస్త్ర చికిత్సలు ఉచితంగా అందనున్నాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఆయుష్మాన్ కార్డు ఉంటే ఉచితం..
సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో బేరియాట్రిక్ సర్జరీ అంటే బరువు తగ్గించే శస్త్రచికిత్స కోసం రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే, ఎంవై ఆసుపత్రిలో ప్రారంభమైన ఈ క్లినిక్ ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నవారికి పరీక్షలు, కౌన్సెలింగ్, సర్జరీ పూర్తిగా ఉచితంగా అందిస్తారు. రోగికి అవసరమైన అన్ని రకాల వైద్య సదుపాయా లు ఒకే చోట అందుబాటులో ఉంటాయి.
మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న ముప్పు..
ఈ సందర్భంగా డివిజనల్ కమిషనర్ డాక్టర్ సుదామ్ ఖాడే మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం ఒక సామాజిక సమస్యగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఊబకాయం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయని, ఈ క్లినిక్ ద్వారా వాటిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
ఊబకాయంతో డయాబెటిస్, హైబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. గుండె సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు తలెత్తుతాయి. మానసిక ఒత్తిడి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒబేసిటీని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com