Fasting with Diabetes..? మధుమేహం ఉన్నవారు ఉపవాస దీక్ష పాటిస్తున్నారా..? ఐతే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
సాక్షి లైఫ్ : పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షల సమయం. అయితే, మధుమేహం ఉన్నవారు రోజా పాటించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఆహారపు అలవాట్లలో మార్పులు, సుదీర్ఘ సమయం ఆకలితో ఉండటం వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో న్యూట్రిషనిస్ట్ల వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
వైద్యుల సలహా ముఖ్యం..
ఉపవాసం ప్రారంభించే ముందే ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించడం అత్యంత అవసరం. మీ షుగర్ స్థాయిని బట్టి మందుల మోతాదు లేదా సమయాన్ని వారు సర్దుబాటు చేస్తారు. స్వయంగా మందులు వాడకూడదు.
'సెహ్రీ' సమయంలో తీసుకోవాల్సిన ఆహారం..
మధుమేహ బాధితులకు 'సెహ్రీ' చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో తీసుకునే ఆహారం రోజంతా శక్తినివ్వాలి. ఓట్స్, దాలియా, బ్రౌన్ రైస్ లేదా మల్టీగ్రెయిన్ రోటీలను ఎంచుకోండి. ఇవి గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేసి, షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పడిపోకుండా చూస్తాయి. ప్రోటీన్, ఫైబర్.. గుడ్లు, పప్పు ధాన్యాలు, కూరగాయలు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉండటానికి సహాయపడతాయి.
'ఇఫ్తార్' విందులో అప్రమత్తత..
రోజంతా ఉపవాసం తర్వాత ఒక్కసారిగా తీపి లేదా వేయించిన పదార్థాలు తింటే చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇఫ్తార్ సమయంలో ఒకటి కంటే ఎక్కువ ఖర్జూరాలు తీసుకోవద్దు, ఎందుకంటే వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. సమోసాలు, పకోడీలు, షర్బత్‌లకు బదులుగా తాజా పండ్లు, పెరుగు, ఉడికించిన పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వండి.
నీటి శాతం తగ్గకుండా..
శరీరంలో నీటి శాతం తగ్గకుండా (Hydration) ఇఫ్తార్ తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కనీసం 8 గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి. టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే ఇవి శరీరాన్ని త్వరగా నిర్జలీకరణానికి గురిచేస్తాయి. పంచదార లేని నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్లు ఉత్తమ ఎంపికలు. ఉపవాస సమయంలో క్రమం తప్పకుండా బ్లడ్ షుగర్ స్థాయిలను తనిఖీ చేసుకోండి. కఠినమైన వ్యాయామాలు మానుకోవాలి. ఎండలో తిరగకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
