Beware of Silent Dehydration : చలికాలంలో పిల్లల్లో సైలెంట్ డీహైడ్రేషన్ పట్ల జాగ్రత్త..!

సాక్షి లైఫ్ : సాధారణంగా ఎండాకాలంలోనే డీహైడ్రేషన్ (dehydration) బారిన పడతామని మనమంతా భావిస్తాం. కానీ, అసలు ముప్పు చలికాలంలోనే పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో ‘సైలెంట్ డీహైడ్రేషన్’ వల్ల వారి చదువు, ఏకాగ్రత దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ముఖ్యంగా శీతాకాలంలో పిల్లల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాలి.

 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల పిల్లలకు దాహం తక్కువగా అనిపిస్తుంది. దీనినే వైద్య భాషలో ‘తక్కువ దాహం సంకేతాలు’ (Reduced Thirst Signals) అంటారు. శరీరానికి నీరు అవసరమైనా మెదడు ఆ సంకేతాలను సరిగ్గా పంపదు. దీనికి తోడు చలి నుంచి రక్షణ కోసం వేసుకునే స్వెటర్లు, మందపాటి దుస్తుల వల్ల లోలోపల చెమట పట్టి శరీరం నీటిని కోల్పోతుంది. దీనిని గుర్తించకపోవడమే ‘సైలెంట్ డీహైడ్రేషన్’. 

 1శాతం నీరు తగ్గినా కష్టమే..!

మెదడులో సుమారు 73శాతం వరకు నీరు ఉంటుంది. శరీరంలో ఉండాల్సిన నీటి శాతంలో కేవలం 1శాతం నుంచి 2శాతం తగ్గినా అది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తరగతి గదిలో పాఠాలు వినేటప్పుడు పిల్లలు త్వరగా అలసిపోతారు. ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడతారు. జ్ఞాపకశక్తి క్షీణత: కొత్త విషయాలను నేర్చుకోవడంలో, గుర్తుంచుకోవడంలో మెదడు నెమ్మదిస్తుంది.

కారణం లేకుండానే పిల్లల్లో కోపం రావడం, నీరసంగా ఉండటం డీహైడ్రేషన్ కు సంబంధించిన లక్షణాలే. పిల్లలు తమకు దాహంగా ఉందని చెప్పకపోయినా, కొన్ని లక్షణాలను బట్టి ఆయా సంకేతాలను సులువుగా గుర్తించవచ్చు. పెదవులు ఆరిపోవడం, చర్మం పొడిబారడం. మూత్రం ముదురు పసుపు రంగులో రావడం. తరచూ తలనొప్పి వస్తోందని చెప్పడం.స్కూలు నుంచి రాగానే విపరీతమైన అలసట చూపడం.

తల్లిదండ్రులు ఏం చేయాలి..?

చల్లని నీరు తాగడానికి పిల్లలు ఇష్టపడరు. కాబట్టి వాటర్ బాటిల్స్‌లో గోరువెచ్చని నీటిని పంపండి. కేవలం నీరే కాకుండా సూప్‌లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ రూపంలో ద్రవాలను అందించాలి. కీరదోస, నారింజ, యాపిల్ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను స్నాక్స్‌గా ఇవ్వాలి. స్కూల్ ల్లో ప్రతి పీరియడ్ అయిన తర్వాత లేదా గంటకు ఒకసారి రెండు గుక్కల నీరు తాగమని పిల్లలకు అలవాటు చేయాలి. శీతాకాలంలో పిల్లల మార్కులు తగ్గినా, వారు చదువులో వెనుకబడినా అది కేవలం వారి నిర్లక్ష్యం కాకపోవచ్చు.. వారి శరీరానికి అందుతున్న నీరు సరిపోకపోవడం కూడా కావచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health stress kids-health-care children-health-tips hot-water dehydration symptoms-of-dehydration kids drinking-water healthy-habits-for-kids health-tips-for-kids
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com