World Obesity Day 2026 Special : మల్టీ డిసీజెస్ కు కారణం..ఒబేసిటీనే..! : వైద్య నిపుణుల హెచ్చరిక..
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ప్రాసెస్డ్ ఫుడ్ (నిల్వ ఉంచిన ఆహారం) అలవాట్లు నేడు మానవాళిని 'ఊబకాయం' (Obesity) అనే మహమ్మారి కోరల్లోకి నెట్టేస్తున్నాయి. నేడు (మార్చి 4) 'ప్రపంచ ఊబకాయ దినోత్సవం' సందర్భంగా వైద్య నిపుణులు ఈ ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఊబకాయం అనేది కేవలం శరీర ఆకృతికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు మూలమని వారు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఊబకాయంతో..
శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల మెటబాలిజం దెబ్బతిని అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. శరీరంలోని అదనపు కొవ్వు కణాలు ఇన్సులిన్ నిరోధకతను పెంచి టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తాయి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి, అధిక రక్తపోటు (BP) గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అధిక బరువు వల్ల మోకాళ్లు, వెన్నెముకపై ఒత్తిడి పెరిగి కీళ్ల అరుగుదలకు కారణమవుతుంది. ఊబకాయ బాధితుల్లో ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కనిపిస్తాయి.
ఒబేసిటీకి ఇదే సరైన పరిష్కార మార్గం..
బరువు తగ్గడానికి ఎటువంటి షార్ట్‌కట్ పద్ధతులు లేవని, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మాత్రమే పరిష్కారమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
పంచదార, మైదా, నూనె పదార్థాలను తగ్గించి.. పీచు పదార్థాలు, తాజా పండ్లు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం (Brisk Walking) లేదా యోగా చేయడం తప్పనిసరి. శరీరం నుంచి విషతుల్యాలను బయటకు పంపేందుకు రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగాలి. ఉద్యోగ రీత్యా ఎక్కువ సేపు కూర్చునేవారు ప్రతి గంటకోసారి కాసేపు నడవడం మంచిది.
పిల్లల విషయంలో..
చిన్నారుల్లో ఊబకాయం పెరగడానికి జంక్ ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింక్స్‌కు బదులుగా పాలు, పెరుగు, పనీర్, పప్పు ధాన్యాల వంటి ప్రోటీన్ ఆహారాన్ని అందించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల 'స్క్రీన్ టైమ్' మొబైల్, టీవీ చూసే సమయం అరగంటకు మించకుండా చూడాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
