సాక్షి లైఫ్ : దేశంలో పొగాకు వినియోగం (Tobacco Use) ముఖ్యంగా యువతలో ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారిని రక్షించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున 'పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు' చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..Hot Yoga : హాట్ యోగా ఎలాంటి వాళ్లు చేయకూడదు ఎందుకు..?
ఇది కూడా చదవండి..Acanthosis Nigricans : అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే ఏమిటి..?
యువత ఎక్కువగా ఉండే పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు కేంద్రంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో అమలు చేయాల్సిన ప్రధాన ఆదేశాలు
ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, అన్ని విద్యా సంస్థలు కింది చర్యలను తప్పనిసరిగా తీసుకోవాలి.
అవేర్నెస్ క్యాంపెయిన్స్.. (Awareness Campaigns)..
పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించే నెలవారీ మాసపత్రికను రూపొందించి పంపిణీ చేయాలి.
'పొగాకు రహిత పాఠశాల,కళాశాల' సందేశాన్ని స్పష్టంగా తెలియజేసే పోస్టర్‌లను ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శించాలి.
పొగాకు రహిత జోన్ (Tobacco-Free Zone) అమలు..
ప్రకటన బోర్డులు..
విద్యా సంస్థకు సంబంధించిన బోర్డులు, ప్రవేశ ద్వారం వద్ద "ఇది పొగాకు రహిత జోన్" అని స్పష్టంగా సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలి.
పరిసరాల్లో నిషేధం..
విద్యా సంస్థల 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకం నిషేధించారు. (COTPA సెక్షన్-6). ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేయాలి.
మానిటరింగ్ కమిటీలు..
పొగాకు నివారణ చర్యలను పర్యవేక్షించడానికి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి విద్యా సంస్థ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి.
తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశం..
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాలను వెంటనే అమలు చేయాలని, దీనికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ ప్రయత్నం ద్వారా, కొత్తగా పొగాకు వ్యసనానికి బానిసలయ్యే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?
ఇది కూడా చదవండి.. మానసిక సమస్యలకు పరిష్కారాలేంటి..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com