కొబ్బరి నీళ్లతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో..   

షేర్ చేయండి:
కొబ్బరి నీళ్లతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో..   

సాక్షి లైఫ్ : కొబ్బరి నీరు అద్భుతమైన పోషకాల గని. ఈ నీళ్లు తాగడం ద్వారా ఒకటి, రెండు కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరి నీరు ఎంతగానో ఉపయోగ పడుతాయి. అంతేకాదు గుండె, మూత్రపిండాలతో సహా అన్ని అవయవాలకు ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవల కాలంలో కొబ్బరి నీటికి ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ముఖ్యంగా ఎండాకాలంలో ఉష్ణోగ్రతల నుంచి డీహైడ్రేషన్ సమస్యల నుంచి బయటపడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.  
 

ఇది కూడా చదవండి.. రెండు రకాల క్యాప్సూల్స్ అమ్మకాలపై నిషేధం..కారణం ఇదే..   

సహజ సిద్ధంగా లభించే కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. వీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, ఫాస్ఫేట్ వంటివి ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నీటిలో కొవ్వు ఉండదు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. 

ఫ్రీ రాడికల్స్.. 

కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. తద్వారా శరీరానికి హాని కలిగించకుండా నిరోధిస్తాయి. కొబ్బరి నీళ్లలో పెద్ద మొత్తంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి ఎనర్జీ డ్రింక్‌గా కూడా ఆరోగ్యకరమైన ఎంపిక. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో ఎనర్జీ డ్రింక్ కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది.

కేలరీలు తక్కువ.. 

సాధారణంగా కేలరీలు ఎక్కువగా ఉండే సోడా, జ్యూస్ , ఇతర పానీయాలతో పోలిస్తే హైడ్రేటెడ్‌గా ఉండటానికి  కొబ్బరినీరు ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. శక్తి స్థాయిలను పెంచడానికి, జీర్ణక్రియను సులభతరం చేయడంలో కొబ్బరి నీరు చాలాబాగా పానిచేస్తుంది.

ఎముకలకు మేలు.. 

కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో కాల్షియం, మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటాయి. కాల్షియం ఎముకలు , దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.  

గుండె ఆరోగ్యం.. 

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నీరు ఎంతగానో సహాయప డుతుంది. ఇది అధిక రక్తపోటును నివారించడమేకాకుండా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి..స్టెరాయిడ్స్ వాడితే ఏమౌతుందో తెలుసా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.