Toasted Skin Syndrome : టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? ఎలాంటి వాళ్లకు వస్తుంది..?
సాక్షి లైఫ్ : గంటల తరబడి ల్యాప్‌టాప్‌ను ఒడిలో లేదా పొట్టపై పెట్టుకుని పనిచేయడం వల్ల బ్రిటన్‌లో ఒక బాలుడు ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్’ (Toasted Skin Syndrome) బారిన పడ్డాడు. ఈ అలవాటు చర్మానికి తీవ్ర నష్టాన్ని కలిగించడమే కాకుండా, భవిష్యత్తులో చర్మ క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్ (Toasted Skin Syndrome)
చర్మం సుదీర్ఘకాలం పాటు వేడికి గురైనప్పుడు ఈ సమస్య వస్తుంది. ల్యాప్‌టాప్ నుంచి వచ్చే వేడి వల్ల చర్మం లోపల ఉండే సూక్ష్మ రక్తనాళాలు, కణజాలాలు దెబ్బతింటాయి. దీనివల్ల చర్మంపై ఎరుపు లేదా గోధుమ రంగులో వల లాంటి ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు చర్మం పొలుసులుగా రాలిపోయి తీవ్రమైన మంట కలుగుతుంది.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
వైద్యులను ఆశ్చర్యపరిచిన బాలుడి కేసు..
బ్రిటన్‌కు చెందిన ఒక బాలుడు రోజుకు దాదాపు 8 గంటల పాటు ల్యాప్‌టాప్‌ను నేరుగా పొట్టపై పెట్టుకుని ఆన్‌లైన్ క్లాసులు వినేవాడు.కొన్నాళ్లకు పొట్టపై వింత మచ్చలు ఏర్పడటంతో వైద్యులు ముందుగా కాలేయ సమస్యగా (Liver problem) అనుమానించారు. మచ్చలు మరింతగా వ్యాపించి, చర్మం ఊడిపోవడం ప్రారంభించిన తర్వాత బాలుడి దినచర్యను ఆరా తీయగా అసలు కారణం ల్యాప్‌టాప్ వేడి అని తేలింది.
పొంచి ఉన్న క్యాన్సర్ ముప్పు..
ఈ మచ్చలను ఆరంభంలోనే గుర్తించి, వేడి తగలకుండా చూసుకుంటే చర్మం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. కానీ, ఎక్కువ కాలం పాటు చర్మం వేడికి గురైతే ఆ మచ్చలు శాశ్వతంగా ఉండి పోతాయి. అత్యంత అరుదైన కేసుల్లో భవిష్యత్తులో స్క్వామస్ సెల్ కార్సినోమా (Squamous cell carcinoma), మెర్కెల్ సెల్ కార్సినోమా వంటి చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని ప్రైమరీ కేర్ డెర్మటాలజీ సొసైటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఒడిలో లేదా శరీరానికి ఆనించుకుని వాడకూడదు. కచ్చితంగా టేబుల్ లేదా ల్యాప్‌టాప్ స్టాండ్‌ను ఉపయోగించాలి. శరీర భాగాలపై ఏవైనా అసాధారణ మచ్చలు కనిపిస్తే వెంటనే వాటిని వేడికి దూరంగా ఉంచాలి. స్మార్ట్‌ఫోన్లలో గంటల తరబడి గేమ్స్ ఆడటం వల్ల మెడ నరాలు దెబ్బతిని, తల కిందికి వాలిపోయే 'డ్రాప్డ్ హెడ్ సిండ్రోమ్' (Dropped Head Syndrome) కూడా వచ్చే ప్రమాదం ఉందని జపాన్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గ్యాడ్జెట్స్ వాడేటప్పుడు సరైన శారీరక భంగిమను పాటించడం బెటర్.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
