రెండు రకాల క్యాప్సూల్స్ అమ్మకాలపై నిషేధం..కారణం ఇదే..   

షేర్ చేయండి:
రెండు రకాల క్యాప్సూల్స్ అమ్మకాలపై నిషేధం..కారణం ఇదే..   

సాక్షి లైఫ్ : అన్ని ప్రాంతీయ ఆయుర్వేద, యునాని అధికారులను వారి సంబంధిత ప్రాంతాల్లో ఈ రెండు క్యాప్సూల్స్ స్టాక్‌ను తనిఖీ చేయాలని, వాటి అమ్మకాలను వెంటనే నిషేధించాలని ఆయుష్ శాఖ ఆదేశించింది. ఆయుర్వేద మందులను విక్రయించే టోకు వ్యాపారులు , చిల్లర వ్యాపారులు ఈ రెండు క్యాప్సూల్స్‌ను విక్రయించకూడదని ఉత్తర్ ప్రదేశ్  ఆరోగ్య శాఖా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 
 
రెండురకాల క్యాప్సూల్స్.. 

అధిక మొత్తంలో స్టెరాయిడ్లు ఉన్నట్లు గుర్తించడంతో ఉత్తర్ ప్రదేశ్ లో రెండురకాల క్యాప్సూల్స్ అమ్మకాలను నిషేధించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు క్యాప్సూల్స్ ను పరీక్షించగా ఆయా నమూనాల్లో ఎక్కువమొత్తంలో స్టెరాయిడ్స్ ఉండడంతో వీటిపై నిషేధం విధించారు.  

  ఇది కూడా చదవండి.. పెయిన్ కిల్లర్స్ ఎందుకు వాడకూడదు..?  

ఆయుష్ శాఖ ఆదేశాలు..  

బలానికి వాడే ఈ రెండు రకాల క్యాప్సూల్స్ తో జాగ్రత్తగా ఉండాలని ఉత్తర్ ప్రదేశ్ ఆయుష్ శాఖ ఆదేశాలు తెలిపింది. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని పేర్కొంది. లక్నోలోని ఆయుర్వేద ల్యాబొరేటరీలో పరీక్షల నిమిత్తం మహరాజ్‌గంజ్ జిల్లా నుంచి పంపిన రెండు క్యాప్సూళ్ల నమూనాల్లో ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్నట్లు తేలింది. 

దీనికారణంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాప్స్యూల్స్  విక్రయాలను నిషేధించాలని ఆయుష్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రాంతీయ ఆయుర్వేద ,యునాని అధికారులను వారి సంబంధిత ప్రాంతాల్లో ఈ రెండు రకాల  క్యాప్సూల్స్ స్టాక్‌ను తనిఖీ చేయాలని ,వాటి అమ్మకాలను వెంటనే నిషేధించాలని ఆదేశింది.

 ఇది కూడా చదవండి.. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాలో ఎన్ని రకాలున్నాయంటే..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.