స్టెరాయిడ్స్ వాడితే ఏమౌతుందో తెలుసా..?
సాక్షి లైఫ్ : ఇటీవల ఫిట్నెస్ కు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ఫిట్ అండ్ పర్ఫెక్ట్ బాడీ కోసం చాలామంది జిమ్ కు వెళుతున్నారు. కానీ కొంతమంది తమ శరీరాన్ని తక్కువ సమయంలోనే మంచి రిజల్ట్ పొందడానికి స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలున్నాయని వారు వెల్లడిస్తున్నారు. స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఎలాంటి సమస్యలున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
స్టెరాయిడ్ల వినియోగం ప్రాణాంతకం..
ఈ రోజుల్లో బాడీ బిల్డింగ్ పట్ల ప్రజల్లో భిన్నమైన క్రేజ్ కనిపిస్తోంది. చాలా మంది వ్యక్తులు, ముఖ్యంగా అబ్బాయిలు, పరిపూర్ణ శరీరాన్ని పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది జిమ్‌లో తీవ్రంగా వర్కవుట్ చేస్తూనే తమ ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకుంటున్నారు. ఇవిమాత్రమే కాకుండా సిక్స్ ప్యాక్ బాడీ కోసంమరికొంతమంది స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి.. రెండు రకాల క్యాప్సూల్స్ అమ్మకాలపై నిషేధం..కారణం ఇదే..
తక్కువ సమయంలో..
తక్కువ సమయంలో కండరాలను పొందేందుకు, చాలా మంది వేరే పద్ధతులను అవలంభిస్తున్నారు. అందులో భాగంగానే స్టెరాయిడ్స్ వాడుతున్నారు. దీని వల్ల ఎలర్జీ సమస్యలే కాకుండా, అనేక తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటివాటిలో..
అధిక బరువు..
బాడీ బిల్డింగ్ కోసం ఉపయోగించే స్టెరాయిడ్స్ ప్రారంభంలో ప్రయోజనకరంగా ఉంటాయి. కానీవాటిని తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కండరాలను పొందేందుకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు లేదా పౌడర్‌లను ఉపయోగిస్తారు. కానీ ఎక్కువరోజులు ఇలా తీసుకోవడం వల్ల మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తుంది. ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. తద్వారా బరువు పెరిగే అవకాశం ఉంది.
జీర్ణ సమస్యలు..
ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల అజీర్ణ సమస్యలు, కడుపులో మంట వంటివి వస్తాయి. అజీర్ణ సమస్యల కారణంగా, గ్యాస్, మలబద్ధకం,అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది కాకుండా కడుపుతో పాటు గుండెల్లో మంట కూడా అనిపిస్తుంది.
సంతానోత్పత్తిపై ప్రభావం..
అనాబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ (ఏఏఎస్) తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది పురుషుల సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒక అధ్యయనం ప్రకారం అధిక మొత్తంలో ఏఏ ఎస్ తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
గుండె జబ్బులు వచ్చే ప్రమాదం..
వైద్యనిపుణుల సలహా లేకుండా ఎక్కువ పరిమాణంలో అనాబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ (ఏఏఎస్) తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఏఏఎస్ వినియోగం గుండె ఎడమ జఠరిక పరిమాణాన్ని , రక్తపోటును పెంచుతుంది. దీని కారణంగా, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి.. పెయిన్ కిల్లర్స్ ఎందుకు వాడకూడదు..?
ఇన్ఫెక్షన్..
ఎక్కువగా స్టెరాయిడ్ మందులు, ఇంజెక్షన్లు లేదా పౌడర్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి వారికి చికెన్‌పాక్స్, రింగ్‌వార్మ్ , మీజిల్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పారాసెటమాల్ వేసుకోకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
