మధుమేహం ఉన్నవారికి మేలుచేసే పప్పు..? 

షేర్ చేయండి:
మధుమేహం ఉన్నవారికి మేలుచేసే పప్పు..? 

సాక్షి లైఫ్: మధుమేహ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఐతే షుగర్ ను అదుపులో ఉంచేందుకు పలు చిట్కాలను అనుసరించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా కందిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు వెల్లడిస్తున్నారు. షుగర్ రోగులకు సరైన ఆహారంతో పాటు వ్యాయామం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కందిపప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో బీపీని నియంత్రించే గుణాలుంటాయి. మధుమేహ సమస్య ఉన్నవారికి కందిపప్పు వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు..

ఇది కూడా చదవండి.. మండే ఎండల్లో చల్లటి నీరు తాగుతున్నారా..?

ఒత్తిడి..

ఒత్తిడి పెరగడం వల్ల, మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. కందిపప్పులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. కందిపప్పు నిత్యం తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

మొలకెత్తిన పచ్చి పప్పులు అధిక బ్లడ్ షుగర్ ను నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి అధిక మొత్తంలో కార్బొహైడ్రేట్లను కలిగి ఉంటాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు.

రోగనిరోధక శక్తి.. 

డయాబెటిక్ రోగులలో సహజంగానే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ కారణంగానే ఒక్కోసారి షుగర్ ఉన్నవారు త్వరగా అనారోగ్యానికి గురవుతారని వైద్య నిపుణులు అంటున్నారు. కందిపప్పుతోపాటు ఇతర పప్పుధాన్యాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

బరువు.. 

డయాబెటిస్‌ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి వారు తీసుకునే ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కందిపప్పు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. పప్పులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు కందిపప్పు తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా అనిపిస్తుంది. అంతేకాకుండా, అతిగా తినడాన్ని కూడా నివారించవచ్చు. తద్వారా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి.. బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్ ఎన్నో..  

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.