Mini Stroke (TIA) : క్షణాల్లో మాయమయ్యే ఈ లక్షణాలతో పెను ప్రమాదం..!
సాక్షి లైఫ్ : అకస్మాత్తుగా మాట తడబడటం, శరీరంలో ఒకవైపు భాగం బలహీనపడటం, కళ్ల ముందు మసకబారడం.. ఇవి నిమిషాల వ్యవధిలోనే తగ్గిపోయినా తేలిగ్గా తీసుకోవద్దు. ఇవి 'మినీ స్ట్రోక్' అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ (TIA)కు సంకేతాలు కావచ్చు. వైద్య పరిభాషలో మినీ స్ట్రోక్‌ను 'TIA' అంటారు. మెదడులోని ఏదో ఒక భాగానికి రక్త సరఫరా కొద్దిసేపు నిలిచిపోయినప్పుడు ఇది వస్తుంది. దీని లక్షణాలు కొన్ని నిమిషాల్లోనే తగ్గిపోయినప్పటికీ, ముప్పు తొలగిపోయినట్లు కాదు. లక్షణాలు తగ్గగానే చాలామంది డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం లేదనుకుంటారు. ఈ నిర్లక్ష్యమే ప్రాణాంతకమైన 'బ్రెయిన్ స్ట్రోక్'కు దారితీస్తుంది. అందుకే ఈ లక్షణాలు కనిపించి, వెంటనే తగ్గిపోయినా సరే అప్రమత్తం కావాలి.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు ఏమిటంటే..?
ముఖం వంకరపోవడం: నవ్వుతున్నప్పుడు లేదా మాట్లాడుతు న్నప్పుడు ముఖం ఒకవైపునకు వాలిపోవడం లేదా కండరాలు పట్టు తప్పినట్లు అనిపిస్తే, అది స్ట్రోక్‌కు ముఖ్య సంకేతం. చేతులు, కాళ్లలో అకస్మాత్తుగా బలహీనత: శరీరంలో ఒకవైపు చేయి లేదా కాలు హఠాత్తుగా బలహీనపడటం, తిమ్మిరిగా అనిపించడం జరుగుతుంది. వస్తువులు పట్టుకోవడంలో, చెయ్యి పైకి ఎత్తడంలో ఇబ్బంది ఎదురవుతుంది.
మాట తడబడటం..
అకస్మాత్తుగా మాట స్పష్టంగా రాకపోవడం, తడబడటం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం జరిగితే వెంటనే అప్రమత్తం కావాలి.
కంటి చూపు మసకబారడం..
ఒకటి లేదా రెండు కళ్లలో హఠాత్తుగా చూపు మసకబారడం, వస్తువులు రెండుగా కనిపించడం, లేదా చూపు మందగించడం లాంటివి జరిగితే కంటి అలసటగా భావించి వదిలేయకూడదు.
కళ్లు తిరగడం, బ్యాలెన్స్ తప్పడం..
ఎలాంటి కారణం లేకుండా హఠాత్తుగా కళ్లు తిరగడం, నడుస్తున్న ప్పుడు తూలిపోవడం కూడా స్ట్రోక్ లక్షణం కావచ్చు. అకస్మాత్తుగా తీవ్రమైన గందరగోళానికి గురికావడం, సాధారణ విషయాలను కూడా అర్థం చేసుకోలేకపోవడం, ప్రవర్తనలో మార్పు రావడం. ఎలాంటి కారణం లేకుండా అకస్మాత్తుగా భరించలేని తలనొప్పి వస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యవసరం.
లక్షణాలను గుర్తించే 'BE FAST' ఫార్ములా..
స్ట్రోక్ లక్షణాలను సులభంగా గుర్తించి ప్రాణాలు నిలబెట్టేందుకు 'BE FAST' అనే ఫార్ములాను గుర్తుంచుకోవాలి.
B - Balance (బ్యాలెన్స్)..అకస్మాత్తుగా సమతుల్యత కోల్పోవడం.
E - Eyes (కళ్లు)..చూపులో ఆకస్మిక మార్పులు.
F - Face (ముఖం).. ముఖం ఒకవైపు వాలిపోవడం.
A - Arms (చేతులు)..చేతుల్లో బలహీనత లేదా సున్నపడటం.
S - Speech (మాట).. మాట తడబడటం లేదా అర్థం చేసుకోవడంలో గందరగోళం.
T - Time (సమయం)..ఏమాత్రం సమయం వృథా చేయకుండా, వెంటనే ఎమర్జెన్సీ సహాయం తీసుకోవాలి.
లక్షణాలు కనిపించిన వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలి. లక్షణాలు వాటంతట అవే తగ్గుతాయి కదా అని ఎదురుచూడటం లేదా రోగి సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లడం వంటివి చేయకూడదు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
