శిశువుల ఆహారం విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన ఐసీఎమ్ఆర్ 

షేర్ చేయండి:
శిశువుల ఆహారం విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన ఐసీఎమ్ఆర్ 

సాక్షి లైఫ్ : ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్ ఆర్) శిశువుల ఆహారానికి సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో శిశువులకు అనుబంధ ఆహారం ఇవ్వడంతో పాటు, ఘనాహారం కూడా ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించింది.  చాలా మంది పప్పుధాన్యాలలో నీరు కలిపి ఇవ్వడం సరైనదని భావిస్తారు. కానీ ఐసీఎమ్ ఆర్ అది సరైనది కాదని తేల్చి చెప్పింది.


 ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

శిశువులకు ఆహారం.. 
చిన్నారులకు 6 నెలల వయస్సు తర్వాత పోషకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆరు నెలలు పూర్తయిన తర్వాత, బిడ్డ ఎదుగుదలకు తల్లి పాలు మాత్రమే సరిపోవు. మెరుగైన పోషకాహారం కోసం పిల్లలకు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ ఆహారం ఇవ్వాలని ఐసీఎమ్ ఆర్ వెల్లడించింది. తల్లి పాలతో పాటు శిశువులకు ఏమి ఇవ్వాలనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. సహజంగానే, బిడ్డ ఆరు నెలలు పూర్తయిన తర్వాత, తల్లి పాలతో పాటు కొంత ఘనఆహారం ఇవ్వాలి. చాలా మంది ఈ విషయంలో పొరపాటు చేస్తుంటారు. అసలు శిశువుకు ఆరునెలలు దాటాక ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేదానిపై ఐసీఎమ్ ఆర్ ఏమి చెప్పింది..? 

శిశువుకు ఆరునెలలు నిండిన తర్వాత ముఖ్యంగా ద్రవపదార్థాలకు బదులుగా కొంచెం మందంగా పాలతో కూడిన సెమీ-సాలిడ్ ఫుడ్‌ను శిశువుకు ఇవ్వాలని, అందులో పప్పు అన్నంకు బదులు, పచ్చి కూరగాయలు లేదా క్యారెట్ వంటివి కలపాలని ఐసీఎమ్ ఆర్ సూచించింది. ఒక సంవత్సరం వరకు శిశువుకు అందించే ఆహారంలో ఉప్పు లేదా చక్కెర ఇవ్వకూడదని కూడా వెల్లడించింది ఐసీఎమ్ ఆర్.


అంతేకాదు శిశువుల ఆహారంలో మసాలాలు కలపవద్దని, వాటిని ఆహారంలో నెయ్యి కలిపి ఇవ్వవచ్చని చెప్పింది. వారికి పాలకు ప్రత్యామ్నాయ ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించండి. శిశువుకు ఆరునెలల దాటాక మొదటి వారంలో కూరగాయలు, రెండవ వారంలో అన్నం ఇవ్వవచ్చని,10-11 నెలల్లో, శిశువుకు ఒక సంవత్సరం వయస్సు వచ్చినప్పుడు, అతనికి బయటి పాలు ఇవ్వవచ్చని వెల్లడించింది.

వీలైనంత వరకు పిల్లలకు చక్కెర ఇవ్వకుండా ఉండడం మేలు. ఎందుకంటే..? పండ్లలోని సహజ చక్కెర వారికి సరిపోతుంది. చిన్న పిల్లలకు క్యారెట్, సొరకాయ, యాపిల్ తో పాటు గుడ్లు, చేపలు ఇవ్వడం మంచిదని ఐసీఎమ్ ఆర్ తెలిపింది. 

ఈ విషయాలను గుర్తుంచుకోండి.. 

ఈ వర్షాకాలం సీజన్‌లో పిల్లలకు తాజా ఆహారాన్ని అందించండి.  రెస్టారెంట్‌లో లేదా బయట దొరికే ఆహారం పిల్లలకు ఇవ్వొద్దు. సలాడ్‌లు, పండ్లు, చట్నీలు అస్సలు ఇవ్వకండి. ఈ సీజన్‌లో పిల్లలకు గరిష్టంగా ద్రవాహారం ఇవ్వండి.  చిన్నారుల ఆహారాన్ని తయారుచేసేటప్పుడు మీ చేతులను శుభ్రంగా కడగాలి.

ఇది కూడా చదవండి..రక్తదానం ఎన్నిరోజులకు ఓసారి చేయవచ్చు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.