Thyroid Problems in Children Too : పిల్లల్లోనూ థైరాయిడ్ .. తల్లిదండ్రులు గుర్తించాల్సిన లక్షణాలివే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా థైరాయిడ్ సమస్య అనగానే అది కేవలం పెద్దలకు, ముఖ్యంగా మహిళలకు మాత్రమే వచ్చే జబ్బు అని చాలా మంది భావిస్తుంటారు. కానీ, ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లలు, నవజాత శిశువులు సైతం ఈ థైరాయిడ్ రుగ్మతల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మెడ భాగంలో ఉండే ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి.. పిల్లల శారీరక ఎదుగుదలకు, మెదడు వికాసానికి ఎంతో కీలకమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో లోపాలు తలెత్తితే పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

భారతదేశంలో థైరాయిడ్ సమస్యలు ఒక ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 4.2 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా.

కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటే పుట్టుకతోనే వచ్చే ప్రమాదం..  


మనదేశంలో సగటున ప్రతి 2,500 మంది పిల్లల్లో ఒకరు పుట్టుకతోనే థైరాయిడ్ లోపంతో జన్మిస్తున్నారు. పుట్టిన పిల్లల్లో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం లేదా హార్మోన్ల ఉత్పత్తి లోపించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే, పిల్లల మానసిక ఎదుగుదల మందగించి, తెలివితేటలు తగ్గే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నవజాత శిశువుల్లో కనిపించే ముందస్తు లక్షణాలు..

పసిపిల్లల్లో థైరాయిడ్ లోపాన్ని గమనించడానికి ఈ సంకేతాలు తోడ్పడతాయి. అవేంటంటే..? 

నిరంతరం నీరసంగా ఉండటం, పాలు సరిగ్గా తాగకపోవడం.

తరచూ మలబద్ధకం సమస్య వేధించడం.

పుట్టిన కొన్ని రోజుల్లో వచ్చే కామెర్లు (Jaundice) దీర్ఘకాలం పాటు తగ్గకపోవడం.

ఏడుస్తున్నప్పుడు గొంతు బొంగురుగా రావడం.

ముఖ్య గమనిక: నవజాత శిశువులకు పుట్టిన వెంటనే 'న్యూబార్న్ స్క్రీనింగ్' (Newborn Screening) పరీక్షలు చేయించడం ద్వారా ఈ థైరాయిడ్ లోపాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు.

ఎదుగుతున్న పిల్లల్లో లక్షణాలు..

స్కూలుకు వెళ్లే పిల్లల్లో లేదా కౌమారదశ అంటే టీనేజ్ లో ఉన్నవారిలో థైరాయిడ్ సమస్యలు ఉంటే ఈ మార్పులు కనిపిస్తాయి. 

అలసట, నీరసం.. త్వరగా అలసిపోవడం, చదువుపై ఏకాగ్రత లోపించడం.

బరువు పెరగడం..శారీరక శ్రమ ఉన్నప్పటికీ అకస్మాత్తుగా బరువు పెరగడం.

చర్మం మార్పులు..చర్మం పొడిబారడం, చలిని అస్సలు తట్టుకోలేకపోవడం.

కౌమారికల్లో సమస్యలు.. టీనేజ్ అమ్మాయిల్లో థైరాయిడ్ లోపం వల్ల రుతుక్రమం (Periods) క్రమం తప్పడం లేదా ఆలస్యం కావడం జరుగుతుంది.

తల్లిదండ్రులు ఏం చేయాలి మరి..?

పిల్లల శారీరక ఎదుగుదల అంటే ఎత్తు, బరువు వయసుకు తగ్గట్టుగా లేకపోయినా, లేదా పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా పీడియాట్రీషియన్ ,లేదా ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించాలి. చిన్న రక్త పరీక్ష (Thyroid Profile) ద్వారా ఈ సమస్యను సులభంగా గుర్తించవచ్చు. వైద్యుల సలహా మేరకు సరైన సమయంలో మందులు వాడటం ద్వారా పిల్లలు సాధారణ స్థితికి చేరుకుంటారు.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.