Diabetes and Fatty Liver Risk : మధుమేహంతో ఫ్యాటీ లివర్ ముప్పు.. 70 శాతం రోగుల్లో ఈ సమస్యే..!
సాక్షి లైఫ్ : మధుమేహం (diabetes) అనగానే కేవలం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ, దాని ప్రభావం కళ్లు, కిడ్నీలు, నరాలు, గుండెపైనే కాకుండా కాలేయం (liver) పైనా తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగుల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోయే 'ఫ్యాటీ లివర్' ముప్పు భారీగా పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు..
టైప్-2 మధుమేహం ఉన్నవారిలో దాదాపు 70 శాతం మందికి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వైద్య పరిభాషలో దీన్ని మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అని పిలుస్తున్నారు.
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే..
ఈ వ్యాధి ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. రోగికి మధుమేహం ఉన్న విషయం తెలిసినా, కాలేయంలో నిశ్శబ్దంగా కొవ్వు పేరుకుపోతున్న విషయాన్ని పసిగట్టలేరు. వ్యాధి ముదిరిన తర్వాతే బయటపడుతుంది.
మధుమేహ రోగుల్లోనే ఈ సమస్య ఎందుకు..?
మధుమేహానికి, ఫ్యాటీ లివర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' గురించి తెలుసుకోవాలని ఎండోక్రైన్ నిపుణులు చెబుతున్నారు.
ఇన్సులిన్ నిరోధకత..
టైప్-2 మధుమేహంలో శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించవు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాకుండా, శరీర కొవ్వు జీవక్రియ (fat metabolism) పైనా తీవ్ర ప్రభావం పడుతుంది.
కొవ్వు నిల్వలు..
జీవక్రియల్లో లోపం తలెత్తినప్పుడు, కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది.
ప్రధాన కారణాలు..
టైప్-2 మధుమేహంతో పాటు ఊబకాయం, పొట్ట చుట్టూ కొవ్వు, రక్తంలో అధిక ట్రైగ్లిజరైడ్స్ వంటివి ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
ఆహారపు అలవాట్లే అసలు శత్రువు..
అధిక క్యాలరీలు ఉండే ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల సమస్య మరింత జటిలమవు తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఆల్కహాల్‌కు బానిసైనా, జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నా కాలేయం త్వరగా దెబ్బతింటుంది.
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం..
ఫ్యాటీ లివర్‌ను సాధారణ సమస్యగా వదిలేస్తే, దీర్ఘకాలంలో కాలేయంలో 'ఫైబ్రోసిస్' (fibrosis) వస్తుంది. ఇది తీవ్రమైతే 'సిర్రోసిస్'కు దారి తీసి, చివరికి లివర్ క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది.
నివారణ ఇలా..
ఫ్యాటీ లివర్ ముప్పు నుంచి బయటపడాలంటే మధుమేహ రోగులు జీవనశైలిలో కచ్చితమైన మార్పులు చేసుకోవాలి.
అధిక బరువు ఉన్నవారు క్రమంగా బరువు తగ్గాలి. శరీర బరువులో కనీసం 3 నుంచి 5 శాతం తగ్గినా కాలేయంలో కొవ్వు గణనీయంగా కరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆహార నియమాలు..
క్యాలరీలు, చక్కెర అధికంగా ఉండే పానీయాలు, స్వీట్లకు దూరంగా ఉండాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI) ఉండే ఆకుకూరలు, తృణధాన్యాలు, తాజా పండ్లను రోజువారీ డైట్లో చేర్చుకోవాలి.
వ్యాయామం..
శారీరక శ్రమ కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం అదుపులో ఉంటే లివర్ సమస్యలు దరిచేరవు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
