సాక్షి లైఫ్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2024: రక్తదానం చేయడం ద్వారా ఒకరి ప్రాణాన్ని రక్షించిన వాళ్లమవుతాము. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు దెబ్బలుతగిలితే రక్తం ఎక్కించాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సరైన సమయానికి కావాల్సిన రక్తం దొరకక ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్త దాన ప్రాధాన్యతను గుర్తించి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది కూడా చదవండి.. సహజంగా చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవచ్చంటే..?
ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. దానం చేసిన రక్తం మళ్లీ మన శరీరంలో పూర్తిగా భర్తీ కావడానికి 48 గంటలు మాత్రమే పడుతుంది. మానవ శరీరంలోని రక్త పరిమాణం శరీర బరువులో ఎనిమిది శాతం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయోజన మానవ శరీరంలో ఒక లక్ష మైళ్ల రక్త నాళాలు ఉన్నాయి.
మానవ రక్తంపై ఇప్పటివరకు జరిగిన అన్ని పరిశోధనలలో, ప్రత్యామ్నాయం మరొకటి కనిపించలేదు. ట్రామా పేషెంట్ అయినా, సర్జికల్ పేషెంట్ అయినా లేదా తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నా, అటువంటి వారికి తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. అవసరాన్ని బట్టి రక్త సంబంధిత ఉత్పత్తులు రోగికి ఎక్కిస్తారు. జూన్ 14వతేదీని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుతారు. ఎవరెవరు రక్తదానం చేయవచ్చు, దానికి సంబంధించిన అపోహలు ఏమిటి, రక్తదానం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తదానం ఎవరు చేయవచ్చు..?
18 ఏళ్లు పైబడిన ప్రతి యువతీ, యువకులు అంటే ఆరోగ్యంగా ఉన్నవారు, తీవ్రమైన సమస్యలు లేనివారు, 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు క్రమం తప్పకుండా రక్తదానం చేయవచ్చు. అలాగే, రక్తం పలుచబడే మందులు తీసుకునేవారు, కామెర్లు, ముఖ్యంగా హెపటైటిస్ బి లేదా సి లేదా రక్తహీనతతో బాధపడేవారు రక్తదానం చేయకూడదు.
అపోహలు..
సాధారణంగా, ఒక యూనిట్ రక్తాన్ని దానం చేసినప్పుడు, అది శరీరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. దీనివల్ల బలహీనంగా కూడా అనిపించదు. ఒక యూనిట్ రక్తాన్ని (సుమారు 300-350 మి.లీ) ఒకేసారి ఇవ్వవచ్చు. మానవ శరీరానికి చాలా సామర్థ్యం ఉంది, ఒక యూనిట్ రక్తాన్ని దానం చేస్తే రెండు రోజుల్లో దానిని భర్తీ చేయవచ్చు. రక్త దానం చేయడం వల్ల అంటువ్యాధులు సోకుతాయని కొందరు అపోహ పడుతుంటారు. కానీ అది నిజం కాదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. రక్తదానం చేసే సమయంలో ఉపయోగించే వస్తువులన్నీ డిస్పోజబుల్ వే, అందువల్ల రక్తదానం సమయంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదు.
రక్తదానం చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి..
రక్తదానం చేసే ముందు తగినన్ని నీళ్లు తాగాలి.
ఖాళీ కడుపుతో రక్తదానం చేయకూడదు.
రక్తదానం చేసిన తర్వాత కూడా తగినంతగా పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
కాస్త బలహీనంగా అనిపిస్తే అరగంట విశ్రాంతి తీసుకోవాలి.
సాధారణంగా రక్తదానం చేసిన తర్వాత ఎటువంటి తీవ్రమైన లక్షణాలు లేదా ప్రమాదం ఉండదు.
రక్తం చాలా రకాలుగా ఉపయోగించపడుతుంది..
ఎర్ర రక్త కణాలు, ప్లేట్‌లెట్లు, ప్లాస్మాతో సహా ఒకే బ్లడ్ బ్యాగ్ నుంచి వివిధ రకాల రక్త ఉత్పత్తులను తయారు చేయవచ్చు. రక్తంలో ఏ భాగం అవసరం అనేదానిపై ఆధారపడి, అది రక్తం నుంచి ఎక్కిస్తారు. అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్నట్లయితే, అదే గ్రూపునకు చెందిన రక్తదాత అవసరం. అయితే, బ్లడ్ బ్యాంకుల్లో అన్ని బ్లడ్ గ్రూపుల రక్తం లభ్యమవుతుంది. రక్తాన్ని మరొక దాతతో భర్తీ చేయడం ద్వారా అందుబాటులో ఉంటుంది.
రక్తమార్పిడి సమయంలో అవసరమైన జాగ్రత్తలు..
రక్తదానం చేసే ముందు దాత, రోగి హెపటైటిస్, హెచ్‌ఐవి, మలేరియా వంటి అవసరమైన పరీక్షలు చేస్తారు. రక్త నమూనాలో ఏదైనా వ్యాధి పాజిటివ్‌గా వచ్చినట్లయితే, బ్లడ్ బ్యాంక్ పూర్తి గోప్యంగా ఉంచి రక్తదాతకు తెలియజేస్తుంది. ఈ సమాచారం మరెవరితోనూ పంచుకోరు. ఏదైనా వ్యాధి గుర్తించినట్లయితే, రోగ నిర్ధారణ, చికిత్సలో రక్త దానం చేసినప్పుడు నిర్వహించే టెస్టులు చాలా ఉపయోగపడుతాయి.
ఎంత గ్యాప్ ఉండాలి..?
రక్తదానం చేసిన మూడు నెలలకు తర్వాత మాత్రమే మళ్లీ రక్తదానం చేయవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముందుగా పరీక్ష చేయించుకోవడం వల్ల రక్తదాతకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఏదైనా సమస్య లేదా లక్షణం కనిపిస్తే ఆ రక్తాన్ని వినియోగించరు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com