Infant Care : పుట్టిన బిడ్డకు తేనె పెడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భారతదేశంలో నవజాత శిశువుల సంరక్షణకు సంబంధించి శతాబ్దాల నాటి ఆచారాలు, సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా బిడ్డ పుట్టగానే నోట్లో తేనె పెట్టడం చాలామందికి ఒక ఆనవాయితీగా వస్తోంది. తేనె తినిపించడం వల్ల బిడ్డ మాటలు మధురంగా ఉంటాయని, ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు నమ్ముతుంటారు. అయితే, ఈ పద్ధతి అస్సలు సురక్షితం కాదని ఆధునిక వైద్య శాస్త్రం, శిశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు.. 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

 

పుట్టిన చిన్నారి జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి పూర్తిగా అభివృద్ధి చెందవు. ఇలాంటి సమయంలో తేనె ఇవ్వడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అసలు ఒక సంవత్సరం లోపు పిల్లలకు తేనె ఎందుకు ఇవ్వకూడదో.. దానికి గల శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ‘ఇన్‌ఫాంట్ బోటులిజం’ ప్రమాదం..

నవజాత శిశువులకు తేనె ఇవ్వకపోవడానికి అత్యంత ప్రధాన కారణం-ఇన్‌ఫాంట్ బోటులిజం (Infant Botulism) అనే అరుదైన, తీవ్రమైన అనారోగ్య సమస్య. తేనెలో ‘క్లోస్ట్రిడియం బోటులినమ్’ (Clostridium botulinum) అనే బ్యాక్టీరియాకు సంబంధించిన సూక్ష్మ బీజాంశాలు (Spores) ఉండే అవకాశం ఉంది. పెద్దల జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా వారిపై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ, ఏడాది లోపు పిల్లల ప్రేగులు చాలా సున్నితంగా ఉండటం వల్ల, ఈ బీజాంశాలు వారి పొట్టలోకి చేరి విషపదార్థాలను (Toxins) విడుదల చేస్తాయి.

2. శ్వాసకోశ ఇబ్బందులు..

ఒకవేళ శిశువు ఈ బోటులిజం బారిన పడితే, అది నేరుగా వారి నాడీ వ్యవస్థ, కండరాలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల శ్వాస తీసుకునేందుకు దోహదపడే కండరాలు బలహీనపడతాయి. ఫలితంగా పాపాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, నిరంతర అలసట, గట్టిగా ఏడవలేకపోవడం, పాలు మింగలేకపోవడం వంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తాయి.

3. తీవ్రమైన జీర్ణ సమస్యలు..

నవజాత శిశువుల జీర్ణక్రియ కేవలం తల్లిపాలను మాత్రమే అరిగించు కునేలా సిద్ధంగా ఉంటుంది. తేనె వంటి సంక్లిష్ట పదార్థాలను జీర్ణం చేసుకునే శక్తి వారికి ఉండదు. తేనె తినిపించడం వల్ల కొందరు పిల్లల్లో తీవ్రమైన మలబద్ధకం, కడుపునొప్పి, గ్యాస్, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.

పుట్టిన వెంటనే శిశువుకు ఏమి ఇవ్వాలి..?

పుట్టిన వెంటనే తల్లికి వచ్చే పసుపు రంగు చిక్కటి పాలు (Colostrum) బిడ్డకు అమృతంతో సమానం. ఇది బిడ్డకు రోగనిరోధక శక్తిని ఇస్తుంది. మొదటి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు తప్ప నీళ్లు, గంజి, తేనె లేదా మరే ఇతర బాహ్య ఆహారాలు ఇవ్వకూడదు. బిడ్డ ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, సంప్రదాయాల కంటే పీడియాట్రీషియన్ సలహాలను పాటించడమే అత్యంత సురక్షితం.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.