Childhood Obesity : పిల్లల్లో స్థూలకాయానికి 'చెక్' పెట్టేందుకు ఎన్ఐఎన్, డబ్ల్యూహెచ్‌ఓ బిగ్ యాక్షన్ ప్లాన్..!
సాక్షి లైఫ్ : దేశంలో కౌమార దశలోని పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయాన్ని అరికట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూనిసెఫ్ (UNICEF) ఇండియా సంయుక్తంగా 'లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్' (LFOF) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కేవలం వ్యక్తిగత ఆహారపు అలవాట్లే కాకుండా, పిల్లల చుట్టూ ఉండే ఆహార వాతావరణాన్ని సమూలంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
అసలు సమస్య..
నేటి కాలంలో పిల్లలు ప్రకటనల ప్రభావంతో ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్, అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహారాలకే (HFSS) మొగ్గు చూపుతున్నా రని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహార ఉత్పత్తులపై లేబులింగ్, హానికరమైన ఆహారాలపై పన్నుల విధింపు, స్కూళ్లలో పోషకాహార విద్యను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఈ బృందం దృష్టి సారించింది. సుమారు 200 మంది విద్యార్థులను 'న్యూట్రిషన్ అంబాసిడర్స్'గా ఎంపిక చేసి స్కూళ్లలో అవగాహన కల్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఊబకాయం, మధుమేహానికి 'హెర్బల్' విరుగుడు..!
మరోవైపు, ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు స్థూలకాయం, మధుమేహాన్ని అరికట్టేందుకు ఒక ప్రత్యేకమైన పాలీ హెర్బల్ మిశ్రమాన్ని అభివృద్ధి చేశారు. ఇది ప్రకృతి సిద్ధమైన ఐదు రకాల అల్లం, దాల్చినచెక్క, మిరియాలు, ఉసిరి, పసుపు పదార్థాలతో రూపొందించారు. ఇది కేవలం రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా.. కణాల్లో కలిగే వాపు (Inflammation), ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి గుండె, మూత్రపిండాలు, కళ్లను రక్షిస్తుంది.
క్లినికల్ ట్రయల్స్ దశలో..
ఈ హెర్బల్ మిశ్రమం ఇప్పటికే జంతువులపై జరిపిన ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలను ఇచ్చింది. త్వరలోనే దీనిని మనుషులపై పరీక్షించనున్నారు (Clinical Trials). ఈ పరీక్షలు పూర్తి కావడానికి 9 నుంచి 12 నెలల సమయం పట్టవచ్చని, పూర్తి స్థాయి విశ్లేషణకు 18 నెలలు పడుతుందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డా.భారతి కులకర్ణి తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న మందులకు ఇది అదనపు సహాయకారిగా పనిచేస్తుందని, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పాఠశాలలు,తల్లిదండ్రులు సమన్వయంతో వ్యవహరిస్తేనే భావి తరాలను ఆరోగ్యంగా ఉంచగలమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
