వేసవికాలంలో పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలంటే..?
సాక్షి లైఫ్: ఎండాకాలం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయి. అందుకు తగినట్లుగా మనం తీసుకునే ఆహరంలో మార్పు, చేర్పులు తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఎండదెబ్బ తగలకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వేసవి కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ జాగ్రత్తలు పాటించాలి. చిన్నారులు ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో తొందరగా అనారోగ్యం బారిన పడుతారు. అందుకోసం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పెద్దల మాదిరిగానే పిల్లలు కూడా వేసవిలో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు కావాల్సిన ఆహారాన్ని వారికి అందించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుచ్చకాయ..
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఎండలు పెరిగే సమయంలో పిల్లలకు పుచ్చకాయ తినిపించాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం ద్వారా డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్ "ఏ" వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.
పెరుగు..
పిల్లలకు ఆహారం ఇవ్వడం చాలా కష్టమైన పని. వేడి నుంచి రక్షించడానికి, పెరుగు తినిపించండి. పెరుగుతో లస్సీ, రైతా వంటివి చేయవచ్చు, పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు, ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
కొబ్బరి నీళ్లు..
పిల్లలు తరచుగా నీళ్లు తక్కువగా తాగుతారు. దీంతో సమ్మర్ సీజన్‌లో త్వరగా అలసిపోతారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, పిల్లలకు కొబ్బరి నీళ్ళు ఇవ్వవచ్చు. విటమిన్ సి, క్యాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు కొబ్బరినీళ్లలో లభిస్తాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతాయి.
దోసకాయ..
వేసవిలో దోసకాయ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. మీరు దానిని పిల్లలకు తినిపించాలి. దోసకాయలో విటమిన్ కె, విటమిన్ డి వంటి పోషకాలు ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. రుచిగా ఉండాలంటే చాట్ మసాలా వేసి పిల్లలకు ఇవ్వవచ్చు.
ఆకుకూరలు..
ఆకుకూరల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఐరన్, క్యాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఏ వంటివి ఇందులో లభిస్తాయి. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలను పిల్లలకు ఆహారంలో చేర్చితే పోషకాహారం అందడమేకాకుండా వారు హెల్తీగా ఉంటారు.
ఇది కూడా చదవండి.. చూయింగ్ గమ్ కొనాలంటే డాక్టర్ ప్రిష్కిప్షన్ తప్పనిసరి..ఎక్కడంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
