పిల్లలలో మయోపియా సమస్యకు ప్రధాన కారణాలు..?
సాక్షి లైఫ్ : సాంకేతికత అభివృద్ధి కారణంగా పిల్లల జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. మునుపటిలాగా వీధుల్లో స్నేహితులతో ఆడుకునే పిల్లలు ప్రస్తుతం కనిపించడంలేదు. ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో ప్లే గ్రౌండ్ లో ఆడుకోవాల్సిన చిన్నారులు గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న గేమ్స్ ఆడుతున్నారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత పిల్లల విద్యలో చాలా మార్పులు వచ్చాయి.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఫోన్ లేదా ల్యాప్‌టాప్..
పలు తరగతులు చదువుతున్న వారికి హోంవర్క్‌ల కోసం ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కూడా ఉపయోగించాల్సి వస్తోంది. ఈ కారణాల వల్ల రోజులో ఎక్కువ భాగం స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌పైనే ఎక్కువగా గడుపుతున్నారు. దీని కారణంగా అటువంటి చిన్నారులు స్థూలకాయం వంటి సమస్యలు ఎదుర్కోవడంతోపాటు దృష్టి సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. ఎక్కువ సమయం స్క్రీన్ పై గడపడం వల్ల వారి కళ్ళపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
స్క్రీన్ సమయం..
ముఖ్యంగా ఎక్కువ స్క్రీన్ సమయం కారణంగా, పిల్లలలో మయోపియా సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఈ మయోపియా కేసులు చిన్నారుల్లో ఎక్కువగా పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే పిల్లలు చిన్న వయసులోనే ఈ సమస్య బారీన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలైనంత వరకు స్క్రీన్ టైమ్ తగ్గించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
