వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

సాక్షి లైఫ్ : ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాల కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. కాబట్టి ఆయా సమస్యల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 29న ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఎలా మొదలైంది..?

వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డేని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 29న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం జీర్ణవ్యవస్థ ,ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడమే. ప్రపంచ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ జీఓ) శరీరంలోని జీర్ణ సమస్యలు ,వాటి నివారణ గురించి జనాలకు అవగాహన కల్పించడానికి ఈ డేని మొదలు పెట్టింది. అసలు ఇది ఎలా మొదలైందో దాని చరిత్ర,ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం.. 

ప్రపంచ డైజెస్టివ్ హెల్త్ డే ఎప్పుడు మొదలైంది..? 

వరల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ జీఓ) 2004సంవత్సరంలో  ఈ రోజును వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే (WDHD)గా పిలవాలని, ప్రజారోగ్య అవగాహన కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని డబ్ల్యూ జీఓ నిర్ణయించింది. ఆ తర్వాత ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవాన్ని మొదటిసారిగా 29 మే 2005న జరుపుకున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ..

డబ్ల్యూ జీఓకు ప్రపంచవ్యాప్తంగా 117 సభ్య సంస్థలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజున, WGO కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవటానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. తద్వారా ప్రజలు అవగాహన కల్పిస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన మార్పులు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diseases gut-health gut-bacteria gut-health-diet who digestive-foods digestive-problems gut-health-benefits gastro-problems world-digestive-health-day-2024 world-digestive-health-day digestive-health-day

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com