పిల్లల్లో టాన్సిల్స్ సమస్య- పరిష్కార మార్గాలు..?
సాక్షి లైఫ్ : పిల్లల్లని వేధించే వాటిలో టాన్సిల్స్ సమస్య ఒకటి. చాలామంది పిల్లలు దీనిబారినపడి పెద్దల్ని నానా ఇబ్బందులు పెడుతుంటారు. ఆఖరికి సర్జరీ చేయించి తీసేయడం జరుగుతుంది. అసలు ఎందుకొస్తుంది. దీన్ని నివారించాలంటే ఏం చేయాలి..? అనే అంశాల గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి తెలిపారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని సార్లు ఇబ్బంది పెట్టినా కూడా టాన్సిల్స్ మంచివి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే బాక్టీరియా లాంటి కొన్ని రకాల క్రిములని ఈ టాన్సిల్స్ అడ్డుకుంటాయి. ఒంట్లో బాగా వేడి చేస్తే ఈ టాన్సిల్స్ వాపు చేసి నొప్పిగా అనిపిస్తాయని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి చెబుతున్నారు. టాన్సిల్స్ రావడానికి ప్రధాన కారణం వేడి చేసే పదార్దాలు తినడం (ఫ్రిడ్జ్లో నీరు తాగడం,. కూల్ డ్రింక్స్, మసాలాలు, కారం, పచ్చళ్ళు లాంటివి అన్నమాట). వాతావరణానికి తగ్గట్లు ఆహారపు అలవాట్లలో కొంచెం మార్పు చేసుకుంటే టాన్సిల్స్ పెద్దగా ఇబ్బంది పెట్టవని ఆయన తెలిపారు.
ఒకవేళ నొప్పితో బాధపడుతుంటే డాక్టరు దగ్గరకి వెళ్లేముందు ఒక్కసారి ఇది చేసి చూడండి. రాళ్ళ ఉప్పు వేసిన వేడి నీరు గొంతు వరకు పోసుకుని పుక్కిలించండి. ఇలా రోజుకి 4 సార్లు చొప్పున 2 రోజులు చేయండి. 90శాతం వరకు నొప్పి మాయం అవుతుంది. అలానే తాగే నీరు కూడా వేడిగా ఉండేలా చూసుకోండి. అదే వృద్దులకు గొంతులో నొప్పి , కఫం తగ్గాలంటే మెత్తగా దంచి జల్లించి న కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి" అని ఆయుర్వేద నిపుణులు నవీన్ అంటున్నారు.
"ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి.రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( షుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి. వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి అయినా కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్‌కి వెళ్లండి. టాన్సిల్స్‌కి చిన్నపాటి సర్జరీ ఉంటుంది" అని ఆయన వెల్లడించారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
