Heart Risk : వీకెండ్ అని వేళతప్పి తింటున్నారా..? గుండె ముప్పు తప్పదు జాగ్రత్త..!
సాక్షి లైఫ్ : మారిన జీవనశైలి కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు సర్వసాధారణంగా మారిపోయాయి. మనం తీసుకునే ఆహారం, నిద్ర, శారీరక శ్రమ..ఇవన్నీ మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు మన దినచర్య ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. ఆఫీసు పనుల వల్ల సమయానికి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తుంటాం. కానీ శని, ఆదివారాలు (weekends) రాగానే మన రొటీన్ పూర్తిగా మారిపోతుంది. సెలవు కదా అని ఆలస్యంగా నిద్రలేవడం, ఆలస్యంగా తినడం చేస్తుంటాం. అయితే, ఈ చిన్న అలవాటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తీవ్రతరం చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..Ferritin Face : 'ఫెర్రిటిన్ ఫేస్' అంటే ఏమిటి..? ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..ICMR’s New Dietary Guidelines : ఐదు నుంచి 18 ఏళ్ల వారు ఏం తినాలి..? ICMR కొత్త మార్గదర్శకాలు ఇవే..
'ఈటింగ్ జెట్లాగ్' అంటే..?
వారం రోజులు ఒక సమయానికి తిని, వీకెండ్స్‌లో ఆ సమయాన్ని మార్చి తినడాన్ని వైద్య పరిభాషలో 'ఈటింగ్ జెట్లాగ్' (Eating Jetlag) అంటారు. ఉదాహరణకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 8 లేదా 9 గంటలకు భోజనం చేసే వారు.. శని, ఆదివారాల్లో రాత్రి 10 గంటలు లేదా ఆ తర్వాత తింటుంటారు. ఇలా ఆహారం తీసుకునే సమయాల్లో వచ్చే ఈ వ్యత్యాసం గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫ్రాన్స్‌లో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది.
అధ్యయనంలో ఏం తేలిందంటే..?
'కమ్యూనికేషన్స్ మెడిసిన్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధకులు సుమారు 8 ఏళ్ల పాటు లక్ష మందికి పైగా సగటు వయసు 42 ఏళ్లు వ్యక్తుల ఆహారపు అలవాట్లను సునిశితంగా పరిశీలించారు. వారంలో తినే సమయానికి, వీకెండ్స్‌లో తినే సమయానికి పొంతన లేని పురుషుల్లో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.
రోజువారీ భోజన సమయానికి, వీకెండ్ భోజన సమయానికి మధ్య ప్రతి ఒక్క గంట వ్యత్యాసానికీ.. పురుషుల్లో గుండె జబ్బుల ప్రమాదం 14 శాతం, కరోనరీ హార్ట్ డిసీజ్ ముప్పు 21 శాతం చొప్పున పెరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
మహిళల్లో ఈ ప్రభావం తక్కువే..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భోజన సమయాల్లో మార్పుల వల్ల మహిళల గుండె ఆరోగ్యంపై పెద్దగా ప్రతికూల ప్రభావం పడినట్లు ఈ అధ్యయనంలో కనిపించలేదు. సాధారణంగానే మహిళల కంటే పురుషుల్లో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు పురుషులు, మహిళల జీవనశైలి, శారీరక,జీవక్రియల మార్పుల్లో ఉన్న వ్యత్యాసాల వల్లే.. మగవారిలో ఈ 'ఈటింగ్ జెట్లాగ్' ప్రభావం అధికంగా కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే 'ఏం తింటున్నాం' అనే దానితో పాటు 'ఏ సమయానికి తింటున్నాం' అన్నది కూడా అత్యంత కీలకం. వారమంతా భోజన సమయాలను ఒకేలా నిర్వహించుకోవాలి. వీకెండ్ కదా అని దినచర్యను అస్తవ్యస్తం చేసుకోకూడదు. సరైన సమయానికి భోజనం చేయడంతో పాటు పొగతాగడం మానేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
