సాక్షి లైఫ్ : మన శరీరానికి ముఖ్యమైన అవయవం మెదడు. ఇది చురుకుగా, ఆరోగ్యంగా పనిచేస్తేనే మనం ఏ పనైనా సమర్థవంతంగా చేయగలుగుతాం. ముఖ్యంగా మెదడు ఎక్కువ కాలం ఆరోగ్యంగా (Brain Longevity) ఉండాలంటే, కొన్ని ముఖ్యమైన పోషకాలు తప్పనిసరి. ఈ క్రమంలో, మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడే 8 అత్యవసర పోషకాలను (Essential Nutrients) గురించి ఇప్పడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
మెదడుకు మేలు చేసే 8 ముఖ్యమైన పోషకాలు..
శరీరంలోని నరాల వ్యవస్థ ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి (Memory) మానసిక స్థితి (Mood) మెరుగుదలకు ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.
1. విటమిన్ B12 (Vitamin B12)నాడీ కణాల ఆరోగ్యం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, జ్ఞాపకశక్తికి కీలకం. దీని లోపం జ్ఞాపకశక్తి తగ్గడానికి దారితీయవచ్చు. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి వాటిలో బి12 విటమిన్ లభిస్తుంది.
2. ఫోలేట్ / విటమిన్ B9 (Folate / Vitamin B9)మెదడు పనితీరుకు, నాడీ కణాల అభివృద్ధికి ముఖ్యం. హోమోసిస్టీన్ (Homocysteine) స్థాయిలను తగ్గిస్తుంది. ఆకుకూరలు (పాలకూర), చిక్కుళ్ళు, సిట్రస్ పండ్లు విటమిన్ B9ను అందిస్తాయి.
3. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు (Omega-3 Fatty Acids)మెదడు కణాల నిర్మాణం, పనితీరుకు కీలకం. వాపును తగ్గించి, అల్జీమర్స్ (Alzheimer's) వంటి వ్యాధుల ముప్పు తగ్గిస్తుంది. కొవ్వు చేపలు (Salmon), వాల్‌నట్‌లు, చియా సీడ్స్, అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
4. విటమిన్ "D" (Vitamin D)అభిజ్ఞా పనితీరు (Cognitive Function) మానసిక స్థితి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యరశ్మి, చేపలు, బలవర్థకమైన పాలలో విటమిన్ "D" లభిస్తుంది.
5. విటమిన్ "ఇ" (Vitamin E)శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative Stress) నుండి రక్షిస్తుంది.గింజలు (బాదం), విత్తనాలు, కూరగాయల నూనెలు తీసుకోవడం ద్వారా విటమిన్ "ఇ" లభిస్తుంది.
6. మెగ్నీషియం (Magnesium)నాడీ కణాల మధ్య సంకేతాలు పంపడంలో మరియు మెదడు విశ్రాంతి తీసుకోవడంలో (Sleep) సహాయపడుతుంది.
ఆకుఆకుకూరలు, డార్క్ చాక్లెట్, నట్స్ ద్వారా మెగ్నీషియం లభిస్తుంది.
7. జింక్ (Zinc)నాడీ సంకేతాల ప్రసారం, మెదడు ఎదుగుదల, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. గుమ్మడి గింజలు, చిక్కుళ్ళు, మాంసం వంటి వాటిలో జింక్ ను పొందవచ్చు.
8. కోలిన్ (Choline)అసిటైల్‌కోలిన్ (Acetylcholine) అనే ముఖ్యమైన న్యూరోట్రాన్స్‌మిటర్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, ఇది జ్ఞాపకశక్తి, కండరాల నియంత్రణకు అవసరం. కోలిన్ (Choline)అసిటైల్‌కోలిన్ ను పొందడానికి గుడ్లు, మాంసం, కూరగాయలు తినాలి.
మెదడు దీర్ఘాయువుకు కేవలం ఆహారం మాత్రమే కాకుండా, ఈ పోషకాలు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా అవసరం. ఈ పోషకాలు లోపిస్తే జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com