సాక్షి లైఫ్ : ఆఫీసులో ఒంటరితనం అనేది శారీరక దూరం కంటే ఎక్కువగా మానసిక(mental), సామాజిక దూరం(social distance) వల్ల ఏర్పడుతుంది. దీని కారణంగా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సంతృప్తిగా ఉండలేరు, ప్రతి క్షణం ఆందోళనతో కుడి ఉంటుంది. ఆఫీస్ లో (loneliness) ఒంటరితనానికి ప్రధాన కారణాలు ఏమిటి..? అనేది ఇప్పడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఆఫీసులో ఒంటరితనానికి కారణాలు ఏమిటంటే..?
రిమోట్ లేదా హైబ్రిడ్ వర్కింగ్(Remote or hybrid working)..
చాలామంది ఉద్యోగులు(employees) ఆఫీసుకు రాకుండా ఇంటి నుంచే పనిచేయడం వల్ల(colleagues) సహోద్యోగులతో నేరుగా ముఖాముఖి సంభాషణలు తగ్గిపోతాయి. దీంతో అనధికారిక సంభాషణలు, భోజన సమయంలో కలిసి మాట్లాడుకోవడం వంటివి లేకుండా పోతాయి.
పోటీతత్వం, మద్దతు లేని కార్యాలయ సంస్కృతి(office culture)..
కొన్ని (offices)కార్యాలయాలలో ఉద్యోగుల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఈ పరిస్థితి ఒకరికొకరు సహాయం(help) చేసుకోవలనే సంస్కృతిని నిరోధిస్తుంది. దీనివల్ల ఉద్యోగులు తమ సమస్యలను ఎవరితోనూ పంచుకోలేక మానసికంగా బాధపడాల్సి వస్తుంది.
సంస్థాగత మార్పులు..
కంపెనీలో ఉద్యోగులను తొలగించడం, విభాగాలు మార్చడం వంటి పెద్ద మార్పులు జరిగినప్పుడు, ఉద్యోగుల మధ్య ఉన్న మంచి సంబంధాలు దెబ్బతింటాయి. కొత్తవారిని కలుసుకోవడానికి ఇబ్బంది పడడం వల్ల ఒంటరితనం పెరుగుతుంది.
సామాజిక నైపుణ్యాలు లేకపోవడం(Lack of social skills)..
కొంతమందికి సహోద్యోగులతో కలవడానికి, మాట్లాడటానికి ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటివారు తమంతట తాముగా ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోలేరు.
అధిక పని భారం (workload)..
నిరంతరం పని ఒత్తిడిలో ఉండటం వల్ల ఉద్యోగులు తమ తోటివారితో మాట్లాడటానికి సమయం కేటాయించలేరు. ఇది క్రమంగా సహ ఉంద్యోగుల మధ్య దూరాన్ని పెంచుతుంది.
టీమ్ లీడర్ల పాత్ర(Role of team leaders)..
టీమ్ లీడర్లు(team leaders) కేవలం పని మీద మాత్రమే దృష్టి పెట్టి, తమ టీమ్‌లోని సభ్యుల మధ్య మంచి సంబంధాలను ప్రోత్సహించకపోతే ఒంటరితనం పెరిగే అవకాశం ఉంది.
వ్యక్తిగత కారకాలు(Personal factors)..
ఒక వ్యక్తి స్వభావం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం (resilience), మానసిక ఆరోగ్యం (mental health)వంటివి కూడా ఒంటరితనానికి కారణాలు కావచ్చు. ఈ కారకాల వల్ల పనిలో ఒంటరితనం పెరిగి, ఉద్యోగుల పనితీరు, ఉత్సాహం తగ్గుతాయి. తద్వారా మానసిక, శారీరక సమస్యలు సైతం తలెత్తుతాయి.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com