Ways to reduce uric acid levels : యూరిక్ యాసిడ్ తగ్గించే సులభమైన మార్గాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రక్తంలో యూరిక్ యాసిడ్(uric acid) పెరగడాన్ని వైద్య పరిభాషలో 'హైపర్‌యూరిసెమియా' అంటారు. మనం తినే ఆహారంలోని 'ప్యూరిన్లు' విచ్ఛిన్నమైన ప్పుడు ఈ యాసిడ్ తయారవుతుంది. ఇది మోతాదు మించితే కీళ్లలో స్పటికాలుగా (Crystals) మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి వైద్యనిపుణులు చెబుతున్న అత్యంత సులభమైన చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

 

  నీరే ప్రధాన ఆయుధం.. !

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి నీరు అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల మూత్రపిండాలు యూరిక్ యాసిడ్‌ను వడకట్టి బయటకు పంపే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

  విటమిన్-సి.. 

నారింజ, నిమ్మ, ఉసిరి వంటి సిట్రస్ జాతి పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్‌ను కరిగించడమే కాకుండా, కొత్తగా పేరుకుపోకుండా నిరోధిస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 స్వీట్స్ వద్దు.. 

చక్కెర అధికంగా ఉండే శీతల పానీయాలు (Cool drinks), ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్‌లలో ఉండే 'ఫ్రక్టోజ్' యూరిక్ యాసిడ్‌ను వేగంగా పెంచుతుంది. కాబట్టి తీపి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం.

 చెర్రీస్, బెర్రీస్..  

డార్క్‌గా ఉండే చెర్రీస్, స్ట్రాబెర్రీలలో 'ఆంథోసయానిన్' అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కీళ్ల వాపులను తగ్గించి, యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

 ఫైబర్ అధికంగా ఉండే ఆహారం.. 

ఓట్స్, తృణధాన్యాలు, ఆకుకూరలు వంటి పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి రక్తంలోని అదనపు యాసిడ్‌ను గ్రహించి బయటకు పంపడంలో తోడ్పడతాయి.

 మాంసాహారం ముఖ్యంగా రెడ్ మీట్, ఆల్కహాల్, సీ ఫుడ్ వంటి ప్యూరిన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గిస్తే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.