సాక్షి లైఫ్ : శిశువులకు ఇచ్చే టీకాల షెడ్యూల్ (Childhood Immunization Schedule)లో అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఒక కీలకమైన మార్పును అధికారికంగా ఆమోదించింది. దశాబ్దాలుగా పాటిస్తున్న పుట్టిన వెంటనే హెపటైటిస్-బి (Hepatitis B) టీకా ఇవ్వాలనే సిఫార్సును ఉపసంహరించుకుంది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
అయితే, ఈ మార్పు ఆరోగ్య నిపుణులు, పిల్లల వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయం దేశంలో హెపటైటిస్-బి కేసులు మళ్లీ పెరగడానికి దారితీయవచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొత్త మార్గదర్శకాలు..?
1991 నుంచి అమెరికాలో ప్రతి శిశువుకు పుట్టిన 24 గంటల్లోపు హెపటైటిస్-బి టీకా మొదటి డోస్ ఇవ్వాలనే విధానం అమలులో ఉంది. కొత్తగా ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం.. తల్లికి హెపటైటిస్-బి వైరస్ లేదని (నెగెటివ్) నిర్ధారణ అయితే, ఆ బిడ్డకు పుట్టిన వెంటనే టీకా ఇవ్వాలా వద్దా..? అనే నిర్ణయాన్ని తల్లిదండ్రులు వైద్యులతో చర్చించి (Individual-based Decision Making) తీసుకోవచ్చు.
ఒకవేళ పుట్టిన వెంటనే టీకా ఇవ్వకపోతే, మొదటి డోస్‌ను కనీసం రెండు నెలల వయస్సు వచ్చే వరకు ఆలస్యం చేయాలని కొత్త సిఫార్సు సూచిస్తోంది. తల్లికి వైరస్ పాజిటివ్ లేదా స్థితి తెలియకపోతే శిశువుకు పుట్టిన వెంటనే టీకా, అలాగే హెపటైటిస్-బి ఇమ్యూన్ గ్లోబులిన్ (HBIG) ఇవ్వాలనే పాత సిఫార్సు యధావిధిగా కొనసాగుతుంది.
కొత్త విధానంపై..
కొత్త విధానంపై అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) వంటి ప్రముఖ వైద్య సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.నియంత్రణకు ముప్పు: ఈ యూనివర్సల్ వ్యాక్సినేషన్ విధానం 1991లో ప్రవేశపెట్టిన తర్వాత, పిల్లల్లో హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్లు దాదాపు 99శాతం తగ్గాయి. ఈ నిర్ణయం ఆ విజయాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన చెందుతున్నారు.
హెపటైటిస్-బి తల్లి నుంచి శిశువుకు కాకుండా, ఇంట్లో ఉండే ఇతర వ్యక్తుల ద్వారా ఉదాహరణకు, ఇన్ఫెక్షన్ ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. చాలా మందికి తమకు ఇన్ఫెక్షన్ ఉన్న విషయం కూడా తెలియదు. కొత్త విధానం అమలులోకి వస్తే, టీకా డోస్‌లు ఆలస్యమయ్యే లేదా పూర్తిగా వేయకుండా ఉండే ప్రమాదం ఉందని, తద్వారా నివారించదగిన దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు (Chronic Liver Disease), క్యాన్సర్ (Cancer) కేసులు పెరగవచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
అదే సమయంలో, CDC మరొక వివాదాస్పద సిఫార్సును తిరస్కరించింది. పిల్లలకు టీకా ఇచ్చిన తర్వాత వారికి తగిన రక్షణ (Antibody Levels) లభించిందో లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు (Serology Testing) చేయాలనే సూచనను CDC ఆమోదించలేదు. ఇలాంటి పరీక్షలకు శాస్త్రీయ ఆధారం (Scientific Evidence) సరిగా లేదని పీడియాట్రిషియన్లు వాదిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com