Ayushman Card : ఆయుష్మాన్ కార్డు పొందడానికి ఏమేం పత్రాలు అవసరం.. ఎలా అప్లై  చేసుకోవాలి..?  

షేర్ చేయండి:
Ayushman Card : ఆయుష్మాన్ కార్డు పొందడానికి ఏమేం పత్రాలు అవసరం.. ఎలా అప్లై  చేసుకోవాలి..?  

సాక్షి లైఫ్ : ఆయుష్మాన్ భారత్ యోజన (Ayushman Bharat Yojana) ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద, పేదలు రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనం కోసం వివిధ పథకాలను నిర్వహిస్తున్నాయి. వీటిలో ఒకటి ఆయుష్మాన్ భారత్ యోజన. ఈ పథకం కింద, పేదలు రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందడానికి వీలుంటుంది.

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 

ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే ఆయుష్మాన్ కార్డు అవసరం. ఈ కార్డు పొందడానికి మీరు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ కార్డు పొందడానికి మీరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ముందుగా, మీరు ఏ పత్రాలను దరఖాస్తు చేసుకోవాలో..? ఆయుష్మాన్ కార్డ్ ఆన్‌లైన్ దరఖాస్తు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 
ఆయుష్మాన్ కార్డ్ కోసం ఏ యే పత్రాలు అవసరం అంటే..?

ఆధార్ కార్డ్
రేషన్ కార్డ్
ఆదాయ రుజువు పత్రం, లేబర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్,
ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్

ఎలా దరఖాస్తు చేయాలి మరి..?

స్టెప్ 1 ముందుగా,వెబ్‌సైట్: beneficiary.nha.gov.in ఆయుష్మాన్ భారత్ బెనిఫిషియరీ పోర్టల్‌కి వెళ్లి బెనిఫిషియరీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్  2 - ఇప్పుడు, మీ ఆధార్-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసుకోండి.

స్టెప్  3 - తర్వాత, జనరేట్ ఓటీపీపై క్లిక్ చేసి, మీ మొబైల్‌ కు వచ్చిన  OTPని యాడ్ చేయండి.

స్టెప్  4 - నెక్స్ట్  పేజీలో, మీరు మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకోవాలి.

స్టెప్  5 - తర్వాత, మీ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి కార్డ్ కోసం మీ అర్హతను తనిఖీ చేయండి. ఇక్కడ, మీరు కుటుంబం, కార్డ్ స్టేటస్ ని చూడవచ్చు.

స్టెప్  6 - మీరు "ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి" పై క్లిక్ చేయడం ద్వారా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టెప్  7 - ఇప్పుడు, పేరు, పుట్టిన తేదీ, కుటుంబ సమాచారం వంటి మీ వ్యక్తిగత వివరాలను భర్తీ చేయాలి. అలాగే, మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఇతర సంబంధిత పత్రాలు వంటి అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.

లాస్ట్ స్టెప్.. మీరు మీ గుర్తింపును ధృవీకరించాలి. మీ ఆధార్-లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఆధార్ ఓటీపీ జనెరేట్ అవుతుంది. ఈ ఓటీపీని సబ్మిట్ చేసిన తర్వాత, మీ వివరాలను సమీక్షించండి. మీ ఆయుష్మాన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఆయుష్మాన్ కార్డు డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.  

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.