హెపటైటిస్ ఎలా వ్యాపిస్తుంది..?

షేర్ చేయండి:
హెపటైటిస్ ఎలా వ్యాపిస్తుంది..?

సాక్షి లైఫ్ : సాధారణంగా, హెపటైటిస్ B, C ,D ప్రధానంగా రక్తం లేదా వీర్యం వంటి సోకిన శరీర ద్రవాలతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. అయితే, హెపటైటిస్ A, E సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తాయి.

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

హెపటైటిస్ లక్షణాలు.. 

హెపటైటిస్ తేలికపాటి లక్షణాలలో బలహీనత, జ్వరం, అలసట, కామెర్లు, వికారం, కడుపులో అసౌకర్యంగా ఉంటాయి. అయినప్పటికీ, సకాలంలో చికిత్స చేయకపోతే, దీర్ఘకాలిక హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్, ముఖ్యంగా హెపటైటిస్ బి, సి వల్ల వచ్చేవి, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.

హెపటైటిస్ నిర్ధారణ ఎలా..?  

రక్త పరీక్ష అయిన కాలేయ పనితీరు పరీక్ష సహాయంతో హెపటైటిస్‌ను గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంలో కాలేయ కణాలు దెబ్బతింటాయి, ఎంజైమ్‌లు పెరుగుతాయి. ఇది కాకుండా, హెపటైటిస్‌ను అల్ట్రాసౌండ్‌ స్కాన్ లో కూడా గుర్తించవచ్చు.

ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే ఏమిటి..?

అతిగా మద్యపానం చేసే వ్యక్తులు అంటే హఠాత్తుగా ఎక్కువ మద్యం తాగడం వల్ల కొవ్వు కాలేయం ఏర్పడుతుంది. అది వాపుకు గురైతే దానిని హెపటైటిస్ అంటారు.

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.