Boost Your Mood : మీ మూడ్ ఎప్పుడూ 'సూపర్'గా ఉండాలంటే ఈ 10 'హ్యాపీ ఫుడ్స్' తినాలి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, ఆందోళనలు మన మానసిక స్థితి (mood)పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా చాలామంది అలసట, ఒత్తిడి, డిప్రెషన్ బారిన పడుతున్నారు. శరీరంలో 'హ్యాపీ హార్మోన్ల' స్థాయిలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. యోగా, వ్యాయామంతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఈ హార్మోన్లను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీ మూడ్‌ను ఎల్లప్పుడూ పాజిటివ్‌గా, ఉత్సాహంగా ఉంచే ఆ 10 రకాల సూపర్ ఫుడ్స్ ఏమిటో చూద్దాం..

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

రోజూ తినాల్సిన 10 'మూడ్-బూస్టర్' ఫుడ్స్..  

డార్క్ చాక్లెట్: ఇది రుచిని మాత్రమే కాదు, మూడ్‌ను కూడా అమాంతం పెంచుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, థియోబ్రోమైన్ వంటి మూలకాలు శరీరంలో ఎండార్ఫిన్లు, సెరోటోనిన్ స్థాయిలను వేగంగా పెంచి, మీకు తక్షణ ఆనందాన్ని ఇస్తాయి.

అవకాడో..

 పోషకాల గని అయిన అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫోలేట్, విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. ఇవి 'డోపమైన్', 'సెరోటోనిన్' అనే ఆనందాన్నిచ్చే హార్మోన్ల ఉత్పత్తికి ఎంతగానో సహాయపడతాయి.

నట్స్..

వాల్‌నట్స్ , బాదం, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దుతిరుగుడు గింజలను స్నాక్స్‌గా తీసుకోవడం అలవాటు చేసుకోండి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మెగ్నీషియం న్యూరోట్రాన్స్‌మిటర్లను సమతుల్యం చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి.

బెర్రీ పండ్లు.. 

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎండార్ఫిన్ల స్థాయిలను పెంచి రోజంతా మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతాయి.

వోట్స్..

 ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వోట్స్ తీసుకోవడం ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులోని అధిక ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరంలో సెరోటోనిన్ స్థాయిలను పెంచేందుకు తోడ్పడతాయి.

కొవ్వు చేపలు..

 నాన్ వెజ్ ఇష్టపడే వారికి సాల్మన్, మాకేరెల్, సార్డిన్ లాంటి చేపలు అద్భుతమైన ఆహారం. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఒత్తిడి, డిప్రెషన్‌ను దూరం చేయడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.

పప్పుధాన్యాలు, బీన్స్..

మన భారతీయ భోజనంలో భాగమైన శనగలు, పెసలు, ఎర్రకందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్, 'ట్రిప్టోఫాన్' అధికంగా ఉంటాయి. ఇవి హ్యాపీ హార్మోన్లను పెంచడమే కాకుండా రాత్రిపూట మంచి నిద్ర పట్టేలా చేస్తాయి.

ప్రోబయోటిక్ ఫుడ్స్..

మన పొట్టకు, మెదడుకు మధ్య బలమైన అనుసంధానం ఉంటుంది. పెరుగు, మజ్జిగ, కిమ్చీ వంటి ఆహారాల్లోని మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ (gut health)ను మెరుగుపరిచి, హ్యాపీ హార్మోన్లను సహజంగా పెంచుతుంది.

అరటిపండు..

అన్ని కాలాల్లో దొరికే అరటిపండులో పొటాషియం, ట్రిప్టోఫాన్ మంచి మోతాదులో ఉంటాయి. ఇవి మూడ్‌ను తక్షణమే ఆనందమయం చేస్తాయి. గ్రీన్ టీ..రోజంతా ఉండే అలసట, ఒత్తిడిని పోగొట్టడానికి గ్రీన్ టీ బెస్ట్ ఆప్షన్. ఇందులోని 'ఎల్-థియానిన్' (L-theanine) అనే అమైనో యాసిడ్ ఒత్తిడిని తగ్గించి మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. రోజుకు 1-2 కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఉరుకుల పరుగుల జీవితంలో కేవలం పనుల వెనక మాత్రమే పరిగెత్తకుండా, మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. రుచికరమైన ఈ ఆహారాలను మీ దైనందిన డైట్‌లో చేర్చుకుని, సహజ పద్ధతిలో మీ 'హ్యాపీ హార్మోన్లను' ఛార్జ్ చేసుకోండి..!

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.