Powerful Health Benefits of Asafoetida : చిటికెడు ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు అపారం..!
సాక్షి లైఫ్ : భారతీయ వంటగదుల్లో 'ఇంగువ'కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కూరల్లో, పప్పుల్లో తాలింపు వేసేటప్పుడు కచ్చితంగా ఇంగువను ఉపయోగిస్తుంటారు. ఇది వంటకాలకు అద్భుతమైన రుచి, సువాసనను మాత్రమే కాదు.. మన ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం, సరైన వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఎదురయ్యే గ్యాస్, అజీర్తి, ఊబకాయం వంటి ఎన్నో సమస్యలకు ఆయుర్వేదంలో ఇంగువను ఒక దివ్యౌషధంగా పరిగణిస్తారు. వాత దోషాలను సమతుల్యం చేసే ఈ ఇంగువ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం..
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
జీర్ణక్రియకు దివ్యౌషధం..
రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా లేదా భారంగా అనిపిస్తే, మీ ఆహారంలో కొద్దిగా ఇంగువను చేర్చుకోవడం మంచిది. ఇందులోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
బరువు తగ్గడంలో..
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇంగువ ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలోని మెటబాలిజం రేటును వేగవంతం చేసి, అదనపు కొవ్వు కరిగేలా చేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలుపుకుని తాగితే జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా, బరువు తగ్గే ప్రక్రియ సులభతరం అవుతుంది.
వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ..
వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో ఇంగువ కీలకంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-వైరల్ గుణాలు మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడతాయి.
గుండె ఆరోగ్యానికి రక్ష..
ఇంగువ రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటు (BP)ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.
మహిళలకు ఎంతో మేలు..
మహిళల ఆరోగ్యానికి ఇంగువ ఎంతో ప్రయోజనకరం అని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా రుతుక్రమ సమయంలో (Periods) వచ్చే కడుపునొప్పి, కండరాల తిమ్మిర్ల నుంచి ఇది ఉపశమనం కల్పిస్తుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను నివారించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది.
వాడే విధానం-తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇంగువ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తాలింపులోనే మేలు.. ఇంగువను నేరుగా కాకుండా ఎప్పుడూ నూనె లేదా నెయ్యిలో వేయించి తాలింపులో వాడటం మంచిది. పప్పు, సాంబార్, పులిహోర, కూరలు, పచ్చళ్లలో దీనిని రుచి కోసం వినియోగించవచ్చు. మోతాదు ముఖ్యం..ఇంగువ చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి వంటల్లో చిటికెడు మాత్రమే వాడాలి. అతిగా వాడితే తలనొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
