Mustard Oil : రాత్రి పడుకునే ముందు బొడ్డుకు ఆవనూనె రాస్తే అద్భుత ప్రయోజనాలు..
సాక్షి లైఫ్ : మారే వాతావరణం కారణంగా చర్మం పొడిబారడం, పెదవులు పగలడం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. అయితే, ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య, చర్మ సమస్యలకు మన పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్న అద్భుతమైన ఇంటి చిట్కా.. 'బొడ్డులో (umbilicus) ఆవనూనె వేయడం'. ఆయుర్వేదంలో కూడా ఈ పద్ధతికి ప్రత్యేక స్థానం ఉంది. మరి రోజూ రాత్రి పూట నాభిలో ఆవనూనె రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
1. చర్మం మృదువుగా మారుతుంది..
చలిగాలికి చర్మం తొందరగా తేమను కోల్పోయి పొడిబారుతుంది. ఆవనూనెలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ 'ఇ' పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి సహజమైన తేమను అందిస్తాయి. నాభికి మన శరీరంలోని నరాలతో సంబంధం ఉంటుంది కాబట్టి, అక్కడ నూనె రాస్తే చర్మం లోపలి నుంచి పోషణ పొంది మృదువుగా, కాంతివంతంగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
2. పగిలిన పెదాలకు చెక్..
చలికాలంలో పెదవులు పగలడం, పొట్టు రాలడం చాలా సాధారణం. రాత్రి పడుకునే ముందు నాభిలో రెండు చుక్కల ఆవనూనె వేసుకుంటే పెదవులు పగలడం ఆగిపోతుంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పెదాలు మృదువుగా, అందమైన గులాబీ రంగులోకి మారతాయి.
3. పొత్తికడుపు నొప్పి, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం..
రాత్రిపూట పొత్తికడుపు చుట్టూ గోరువెచ్చని ఆవనూనెతో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల అక్కడి కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కడుపుబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలకు నెలసరి (periods) సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్లను తగ్గించి సుఖవంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది.
ఎలా రాసుకోవాలి..?
రాత్రి నిద్రపోయే ముందు బొడ్డును శుభ్రంగా తుడుచుకుని పొడిగా చేసుకోవాలి. అందులో 2 లేదా 3 చుక్కల ఆవనూనె వేసి, నాభి చుట్టూ చేతి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు.
ఎవరు వాడకూడదు అంటే..?
చర్మం బాగా సున్నితంగా ఉన్నవారు, ఆవనూనె పడని వారు (allergic) దీనికి దూరంగా ఉండాలి. ఒకవేళ వాడాలనుకుంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. బొడ్డు చుట్టూ ఏవైనా గాయాలు, కోతలు, ఎర్రబడటం లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు నూనె అస్సలు రాయకూడదు. చిన్న పిల్లలకు నాభిలో నూనె వేసే ముందు తప్పనిసరిగా పిల్లల వైద్యుడి (Pediatrician) సలహా తీసుకోవాలి. ఒకవేళ నూనె రాసిన తర్వాత మంటగా లేదా దురదగా అనిపిస్తే వెంటనే కడిగేయాలి.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
