Natural Remedies : గొంతు నొప్పికి ఈ సహజ చిట్కాలతో చెక్ పెట్టండి..
సాక్షి లైఫ్ : రుతువుల మార్పు, వాతావరణంలో తేడాలు, అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్ల వల్ల జలుబు, దగ్గుతో పాటు గొంతు బొంగురుపోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలు సాధారణంగా తలెత్తుతుంటాయి. దీనివల్ల ఆహారం మింగడం మాత్రమే కాకుండా కనీసం మాట్లాడటం కూడా తీవ్ర అసౌకర్యంగా మారుతుంది. గొంతు నొప్పికి ప్రతిసారీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లే కారణం కాకపోవచ్చు. అనేక సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా కారణమవుతాయి. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే యాంటీబయాటిక్స్ వాడకుండా, ముందుగా వంటింట్లో లభించే సులభమైన సహజ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు.
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఉపశమనం కలిగించే సహజ మార్గాలు..
తులసి-మిరియాల కషాయం.. ఆయుర్వేదంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక కప్పు నీటిలో నాలుగైదు తులసి ఆకులు, చిటికెడు మిరియాల పొడి వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా తాగితే గొంతులోని గరగర తగ్గి స్వాంతన లభిస్తుంది.
ఉప్పు నీటితో పుక్కిలించడం..
గొంతు నొప్పి, వాపును తగ్గించడంలో ఉప్పు నీటి గార్గ్లింగ్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా ఉప్పు కలిపి, రోజుకు రెండు లేదా మూడు సార్లు పుక్కిలిస్తే గొంతులో పేరుకుపోయిన శ్లేష్మం తొలగి ఉపశమనం లభిస్తుంది.
తేనె వినియోగం..
తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి గొంతులోని పొడిబారిన తనాన్ని తగ్గిస్తుంది. ఒక చెంచా స్వచ్ఛమైన తేనెలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవడం వల్ల దగ్గు అదుపులోకి వచ్చి గొంతు తేలికపడుతుంది.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
ఈ చిట్కాలు ప్రారంభ దశలో తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. ఒకవేళ తీవ్రమైన జ్వరం, తీవ్రమైన మింగుడు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా సమస్య మూడు నుంచి నాలుగు రోజులకు మించి కొనసాగితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
