మీరు ఫ్రిజ్ లో నిల్వా ఉంచిన మాంసం తింటున్నారా..?  

షేర్ చేయండి:
మీరు ఫ్రిజ్ లో నిల్వా ఉంచిన మాంసం తింటున్నారా..?  

సాక్షి లైఫ్ : నేటి జీవన విధానంలో రిఫ్రిజ్ రేటర్ భాగమైంది. అవసర మైంది.. అవసరం లేనిది కూడా ఇందులో పెట్టడం అలవాటుగా మారిపోయింది. దీంతో కూరగాయలు, కోడి గుడ్లు, ఇతర నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రిజ్ లో పెట్టేస్తున్నారు. ఐతే రిఫ్రిజ్ రేటర్ లో ఎక్కువరోజులు ఆహారాన్ని ఉంచి తింటే.. ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్లేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చదవండి.. కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఎక్కువ రోజులు..

రిఫ్రిజ్ రేటర్ లో ఎక్కువ రోజులు ఉంచిన ఫుడ్ తినడంవల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అనారోగ్యాల బారీన పడుతున్నారు. కాయగూరల దగ్గర నుంచి మాంసాహారం వరకూ అన్నిరకాల పదార్థాలను అవసరం లేకున్నా ఫ్రిజ్ లో పెట్టి నానా ఇబ్బందులు పడుతున్నారు. రిఫ్రిజ్ రేటర్ లో మాంసం పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?  

కలుషిత ఆహారం..

 ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 60 కోట్ల మందికిపైగా కలుషిత ఆహారం తిని తద్వారా అనారోగ్యాల పాలవుతున్నారు. వారిలో సుమారు నాలుగులక్షల 20వేల మంది చనిపోతు న్నారు. ఈ రకమైన అనారోగ్యాలకు ప్రధాన కారణం బాక్టీరియా. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహారం లేదా ఎక్స్‌పైరీ డేట్ దాటినవి, సరిగ్గా భద్రపరచని ఆహారం తినడం ద్వారా ఈ బాక్టీరియా వ్యాపిస్తుంది. దీనికారణంగా ఇది జీర్ణవ్యవస్థకు, పేగులకు తీవ్ర హాని కలిగిస్తుంది. కొందరికి వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ ఎక్కువై మరింత తీవ్రమైయ్యే పరిస్థితి వస్తుంది.

 పచ్చిమాంసం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్లనే సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మాంసం ఫ్రిడ్జిలో పెడితే  ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలామంది అపోహ పడుతుంటారు. పద్దతి ప్రకారం పెట్టకపోతే బాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. అవి సహజంగా ఆహారంలో ఉంటాయి. అయితే, ఫ్రిడ్జిలో అవి పెరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. 

నేరుగా ఫ్రిడ్జిలో పెట్టకూడదు..

షాపు నుంచి మాంసం కొనుక్కొచ్చి నేరుగా ఫ్రిడ్జిలో పెట్టకూడదు. మాంసంకొట్టులో లేదా సూపర్‌మార్కెట్లో కొన్న మాంసాన్ని పాలిథీన్ కవర్‌లోనో లేదా బాక్సులోనో పెట్టి ఇస్తారు. మాంసం పెట్టిన కవర్లో కొంచం రక్తం లేదా ఇతర ద్రవాలు ఉండిపోవచ్చు. వాటిల్లో బాక్టీరియా నిక్షిప్తమై ఉంటుంది. అలా కాకుండా శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఎక్కువరోజులు ఉంచినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దాని సహజత్వాన్ని కోల్పోతుంది. చికెన్ , మటన్ బాగా ఉడికించాలి. వండుతున్నప్పుడు ఉష్ణోగ్రత కనీసం 70°Cకి చేరుకుంటే, వాటిలోని బాక్టీరియా అంతా తొలగిపోతుంది.

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.