నిద్రించడానికి ఉత్తమ మార్గాలు..  

షేర్ చేయండి:
నిద్రించడానికి ఉత్తమ మార్గాలు..  

సాక్షి లైఫ్ : హాయిగా నిద్ర పోవాలంటే సరైన విధానంలో పడుకోవాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్శిటీలో న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ చాంఘో యున్ యవ్వనంగా ఉండటానికి కొన్ని సరైన నిద్ర మార్గాలను సూచించారు. అవేంటంటే..? 

ఎడమవైపు ఎక్కువసేపు పడుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా పడుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉండొచ్చని వారు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ స్లీప్ పొజిషన్ గ్యాస్, అసిడిటీ, గర్భాశయ, మెడ నొప్పి, వెన్నునొప్పి, హై బీపీ, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట.

ఇది కూడా చదవండి.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దంటే..?  

-ఎక్కువ సేపు ఒకే వైపు పడుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. పడుకునేటప్పుడు పొజిషన్ మార్చుకుంటూ ఉండాలి. 

-బోర్లా కడుపు మీద పడుకుంటే.. మీరు 5-10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుకోకూడదు. దీని కారణంగా, మీకు వెన్నునొప్పి, కడుపు నొప్పి ,జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

-మంచి నిద్ర పొందడానికి, డిప్రెషన్‌ను దూరంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. నవ్వు అన్ని విధాలా ఆరోగ్యం. కాబట్టి నిద్రకు ఉపక్రమించేటప్పుడు కొద్దిసేపు సరదాగా జోక్స్ చదువుకోవడం ఉత్తమం.  

నిద్రలేమి సమస్య బద్ధకాన్ని కలిగిస్తుంది. యాక్టివ్ గా లేకపోతే శరీర శక్తి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు విలియం డిమెంట్‌ నిద్రపై నిర్వహించిన ఒక అధ్యయనంలో సరైన విధానంలో పడుకోవడం ద్వారా హెల్తీ గా ఉండొచ్చని తేలింది. 

ఇది కూడా చదవండి.. సమ్మర్ లో చర్మ సంరక్షణ ఎలా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.