బరువు తగ్గించే నల్ల ఉప్పు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వంటగదిలో కనిపించే కొన్నిపదార్థాల్లో దాగిఉన్న ప్రయోజనాలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అటువంటి వాటిలో నల్ల ఉప్పు ఒకటి. నల్ల ఉప్పు సరైన పరిమాణంలో తినడం ద్వారా, జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. బ్లాక్ సాల్ట్ ను ప్రతి ఇంట్లో ఆహార పదార్థాలలో, పానీయాలలో ఉపయోగిస్తారు. కాల్షియం, ఐరన్ ,మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ ఉప్పు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయ పడుతుంది. నల్ల ఉప్పుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటే..?

అధిక బరువుకు పరిష్కారం..  

బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. నల్ల ఉప్పులో స్థూల కాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. తినే ఆహారంలో గానీ,  తాగే పానీయాల్లో గానీ నల్లఉప్పు చేర్చుకుంటే, అది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలను బయటకు పంపి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  

ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..    

బెనిఫిట్స్.. 

వంటగదిలో  అందుబాటులో ఉండే బ్లాక్ సాల్ట్ (నల్ల ఉప్పు)చాట్ లేదా సలాడ్ అయినా వాటి రుచిని పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. 

ఎసిడిటీ..

గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఉంటే నల్ల ఉప్పు చాలా ఉపయోగ కరంగా ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

జీర్ణసమస్యలకు..

ఈ రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, చాలా మంది  జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి చిటికెడు నల్ల ఉప్పుతో ఆయా సమస్యలనుంచి సులభంగా బయటపడొచ్చు. అంతేకాదు కడుపు నొప్పి ఉన్నవారికి కూడా నల్ల ఉప్పు బాగా పనిచేస్తుంది.   

గుండెకు..  

చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి నల్లఉప్పు సరైన పరిష్కారం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 

ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంట‌లు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.