మూర్ఛ లక్షణాలు..? ప్రధాన కారణాలు..? 

షేర్ చేయండి:
మూర్ఛ లక్షణాలు..? ప్రధాన కారణాలు..? 

సాక్షి లైఫ్ : వయస్సుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్లదాకా సమస్యలు, ఆందోళనలు ఉంటాయి. ఈ పరిస్థితులు ఎవరినైనా ఎప్పుడైనా ప్రభావం చేస్తాయి. దీనివల్ల న్యూరాన్లలోని ఆకస్మిక, అనియంత్రిత విద్యుత్ ప్రవాహాలు మూర్ఛలకు కారణమవుతాయి. ఈ సమస్యలు ఎక్కువగా ఎలాంటివారిలో వచ్చే అవకాశం ఉంటుంది..? ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

మూర్ఛ లక్షణాలు.. ఎలావుంటాయంటే..? 

 శరీరం గట్టిపడటం.. 

శ్వాస సమస్యలు.. 

 కారణం లేకుండా అకస్మాత్తుగా పడిపోవడం.. 

ప్రేగు లేదా మూత్రాశయం నియంత్రణ కోల్పోవడం.. 

ముఖ్యంగా స్పృహ కోల్పోవడం

చేతులు లేదా కాళ్లలో జలదరింపు అనిపించడం.. 

కొన్నిసార్లు మూర్ఛపోయినప్పుడు ఏమి జరిగిందో గుర్తుంచలేరు..

తదేకంగా చూస్తూ ఉండిపోతారు.. 

స్పృహ కోల్పోవడం..

మూర్ఛలకు ప్రధాన కారణాలు..?

న్యూరో ట్రాన్స్మిటర్లు, కణితులు, స్ట్రోక్ , మెదడు దెబ్బతినడం, నరాల-సిగ్నలింగ్ రసాయనాల అసమతుల్యతతో సహా మూర్ఛకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మూర్ఛ వ్యాధికి గుర్తించదగిన కారణాలు ఉండకపోవచ్చు.

 ట్రీట్మెంట్..?  

యాంటీ-ఎపిలెప్టిక్ డ్రగ్స్ అని పిలిచే మందులు ఇస్తారు. మూర్ఛలకు కారణమయ్యే మెదడులోని చిన్న భాగాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స కూడా చేస్తారు. మూర్ఛలను నియంత్రించడంలో సహాయపడే ఒక చిన్న విద్యుత్ పరికరాన్ని శరీరం లోపల ఉంచే ప్రక్రియ ఉంటుంది. ఫిట్స్ ను నియంత్రించే ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు సరైన జీవనశైలి అవసరం. కొంతమందికి జీవితకాలంపాటు చికిత్స అవసరం ఉండవచ్చు. 

ఇది కూడా చదవండి.. రోగనిరోధక శక్తిని పెంచే పండు..  

గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.