Health Benefits of paan : భోజనం తర్వాత తాంబూలం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భారతదేశంలో భోజనం తర్వాత తాంబూలం (paan) తినే సంప్రదాయం చాలా పురాతనమైనది. చాలామంది దీన్ని మౌత్ ఫ్రెషనర్‌గా భావిస్తారు. అయితే ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతిలో తాంబూలం తింటే అది ఏ మందుకూ తీసిపోదని నిపుణులు చెబుతున్నారు. ఇంటి భోజనం తర్వాత మాత్రమే కాకుండా, బయట రెస్టారెంట్లలో తిన్న తర్వాత కూడా చాలామంది తాంబూలం తినే అలవాటు కలిగి ఉంటారు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

 

ఆయుర్వేదం ప్రకారం తాంబూలం ఒక సహజ ఔషధం
జీర్ణక్రియ, నోటి దుర్వాసన, గ్యాస్ సమస్యలకు పరిష్కారం
సరైన పద్ధతిలో తింటే అనేక లాభాలు

జీర్ణక్రియకు మేలు.. 

తాంబూలం నమిలేటప్పుడు నోటిలో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలంలో ప్రత్యేకమైన జీర్ణ ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి తిన్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమయ్యేలా సహాయపడతాయి. దీనివల్ల భోజనం తర్వాత కడుపు బరువుగా అనిపించదు.

యాసిడిటీ, గ్యాస్ సమస్యలకు ఉపశమనం..

మసాలా, జిడ్డు కూరలు ఎక్కువగా తినడం వల్ల ఛాతీలో మంట, పుల్లటి త్రేన్పులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తుంటాయి. తాంబూలంలో ఆల్కలైన్ గుణాలు ఉండటం వల్ల కడుపులోని ఆమ్లం తటస్థమవుతుంది. దీంతో యాసిడిటీ, గ్యాస్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి..

తాంబూలంలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-మైక్రోబియల్ గుణాలు భోజనం తర్వాత నోటిలో పేరుకుపోయే బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ బ్యాక్టీరియా వల్లే నోటి దుర్వాసన వస్తుంది. దీంతోపాటు, ఇది చిగుళ్లను కూడా బలంగా చేస్తుంది. ఈ విధంగా, భోజనం తర్వాత సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తాంబూలం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగు పడటంతోపాటు, యాసిడిటీ, గ్యాస్, నోటి దుర్వాసన వంటి సమస్యల నుంచి సహజంగా ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.