Health Care: క్యాల్షియం ట్యాబ్లేట్స్ ఎలాంటి వాళ్లకు అవసరం..?  

షేర్ చేయండి:
Health Care: క్యాల్షియం ట్యాబ్లేట్స్ ఎలాంటి వాళ్లకు అవసరం..?  

సాక్షి లైఫ్ : 25 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలకు రోజుకు1,000 ఎంజీ కాల్షియం అవసరం. 50 ఏళ్లు పైబడిన మహిళలు ఐతే  రోజుకు1,000-1,200 ఎంజీ వరకు క్యాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. 25 నుంచి 70 సంవత్సరాల వయస్సున్న పురుషులకు రోజుకు1,000 ఎంజీ కాల్షియం కావాల్సి ఉంటుంది. సహజంగా క్యాల్షియం అనేది చిన్నా, పెద్ద అనేతేడాల్లేకుండా అందరికీ అవసరమే. కాకపోతే మహిళల విషయంలో క్యాల్షియం పాత్ర చాలా ప్రధానమైంది.

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

 

70 ఏళ్లు పైబడిన వాళ్ళకైతే.. 

అదే 70 ఏళ్లు పైబడిన వాళ్ళకైతే రోజుకు1,000-1,200 ఎంజీ కాల్షియం అవసరం. క్యాల్షియం ట్యాబ్లేట్స్ పరగడుపున అస్సలు వేసుకోకూడదు. ఖచ్చితంగా భోజనం తర్వాతనే తీసుకోవాలి. అయితే  క్యాల్షియం ట్యాబ్లేట్స్ లో రెండురకాల ట్యాబ్లేట్స్ ఉన్నాయి. 

వీటిలో క్యాల్షియం మాత్రమే ఉండే ట్యాబ్లేట్స్.. ఒకరకం అయితే , క్యాల్షియం తోపాటు విటమిన్ "డి" ఉండే ట్యాబ్లేట్స్ మరోరకం. ప్రతి మనిషికి ప్రతిరోజూ రెండువేల ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ "డి " అవసరమవుతుంది. 

క్యాల్షియం ఒక్కటే ఉండి విటమిన్ "డి " లేకపోతే వాడకూడదు..

క్యాల్షియం ఒక్కటే ఉండి విటమిన్ "డి " లేకపోతే వాడకూడదు. క్యాల్షియం ట్యాబ్లెట్ మాత్రమే వాడుతున్నప్పుడు "డి" విటమిన్ లోపం ఉంటే క్యాల్షియం ట్యాబ్లెట్ పనిచేయదు. కాబట్టి  విటమిన్ "డి " టెస్ట్ చేయించుకొని నార్మల్ ఉంటే క్యాల్షియం ట్యాబ్లెట్ ఒక్కటే వాడొచ్చు.

 ఎముకలు బలహీనంగా ఉండేవాళ్ళు మాత్రమే క్యాల్షియం ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. క్యాల్షియం ట్యాబ్లెట్స్ మాత్రమే వాడితే ఎముకలు బలంగా ఉండవు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా కూడా ఎముకలు దృఢంగా మారుతాయి. మెనుపాజ్ వయసులో ఉన్న మహిళలకు మాత్రమే క్యాల్షియం ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. ఇతరులకు కొన్ని సందర్భాల్లో మాత్రమే వాడాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.