సాక్షి లైఫ్ : మనం ఏది తిన్నా అది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మనం పోషకాహారం తింటే, మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండగలుగుతాం. ఒకవేళ అనారోగ్యకరమైన ఆహారం తింటే అది శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మన శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మనం తీసుకునే ఆహారం మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మనం తినే ఆహారం మన మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..