తాగే మంచి నీటిని ఎలా ఎంపిక చేసుకోవాలి..?
సాక్షి లైఫ్ : మనం తాగే నీరు ఆరోగ్యానికి చాలా కీలకం. సరైన నీరు తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మంచి నీరు ఎంపిక చేసుకోవడం ఎలా అనేదానిపై అందరికి అవగాహనా ఉండాలి. అందుకోసం కొన్ని ముఖ్యమైన సూచనలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
తాగేనీటి టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్(టీడీఎస్) స్థాయిని కొలిచే పరికరాన్ని ఉపయోగించండి. ఆర్వో ప్యూరిఫైయర్లలో టీడీఎస్ అడ్జస్టర్ ఉంటే, దాని ద్వారా టీడీఎస్ స్థాయిని 100-250 పీపీఎమ్ మధ్య ఉండేలా చూసుకోండి. సాధ్యమైతే, ఖనిజాలను నిలుపుకునే ప్యూరిఫికేషన్ పద్ధతులు (ఉదా: యూవీ ప్యూరిఫైయర్లు, గ్రావిటీ ఆధారిత ప్యూరిఫైయర్లు) లేదా సరైన ఫిల్ట్రేషన్ గల వాటర్ ప్యూరిఫైయర్లను ఎంచుకోండి.
ప్రత్యామ్నాయంగా, ఫిల్టర్ చేసిన కుళాయి నీటిని లేదా సురక్షితమైన బావి నీటిని తాగడం మంచిది. ఆరోగ్యకరమైన జీవితానికి స్వచ్ఛమైన నీరు ఎంత ముఖ్యమో, అందులో సరైన మొత్తంలో ఖనిజాలు ఉండటం కూడా అంతే ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ఆర్వో వాటర్ వినియోగం పట్ల జాగ్రత్తగా ఉండి, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
