పీసీఓడీ నియంత్రణ ఎలా..? 

షేర్ చేయండి:
పీసీఓడీ నియంత్రణ ఎలా..? 

సాక్షి లైఫ్ : పీసీఓడీ సమస్యను నివారించడానికి కొన్నిరకాల జాగ్రత్తలు అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. అందుకోసం తీసుకునే ఆహారంలోనూ, జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలని, తద్వారా పీసీఓడీ సమస్యను నివారించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.  

అండాశయం.. 

పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్ (పీసీఓడీ) అండాశయం నుంచి అండం విడుదల కాకుండా ఉండడం వల్ల నెలసరి రాదు. దీని కారణంగా అండాశయంలో అండం ఉండటంతో దాని చుట్టూ నీరు చేరి, అవి బుడగలుగా మారుతాయి. దీనినే "పీసీఓడీ" సమస్య అంటారు. 

ఇది కూడా చదవండి.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు ప్రధాన కారణాలు..  

పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్. ఈ రుగ్మత ఇటీవలకాలంలో  మహిళల్లో సర్వసాధారణంగా మారింది. హార్మోన్ల ప్రభావం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.  

ప్రధానంగా అండాశయంలో అండం ఉండటంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయి. ఈ సమస్యను నివారించడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

   ప్రాసెస్ చేసిన ఆహారం.. 

పీసీఓడీ సమస్య ఉన్నవాళ్లు ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే చక్కెరతో తయారు చేసిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చన్నారు వైద్యులు.

ఇది కూడా చదవండి..  టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.