మంకీ ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధి 'మంకీ ఫీవర్'. ఇది ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్. దీనిని క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది కోతుల ద్వారా వ్యాపిస్తుంది. కోతులను కుట్టిన దోమలు, ఇతరకీటకాలు మనిషికి కుడితే తద్వారా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. 1957లో తొలిసారిగా ఈ జ్వరాన్ని గుర్తించారు. ఈ వ్యాధికి కర్ణాటకలోని క్యాసనూర్ జిల్లా పేరు పెట్టారు.
నివారణ ఎలా..?
మంకీ ఫీవర్ ఉన్నవారికి ఒక నెలలో రెండు మోతాదులలో టీకా ఇస్తారు. అడవుల్లో లేదా అడవుల చుట్టుపక్కల నివసించే వ్యక్తులకు ఈ వైరస్ ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి అటవీ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జంతువులతో సంబంధాన్ని నివారించడంతోపాటు శుభ్రంగా ఉండడం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని కొంతవరకు నివారించవచ్చు.
మంకీ ఫీవర్ లక్షణాలు
- తీవ్ర జ్వరం
- చలిగా అనిపించడం
- కండరాలలో నొప్పి
- తలనొప్పి
- వాంతులు
- రక్తస్రావం సమస్య
- ప్లేట్‌లెట్స్ పడిపోవడం
- కంటి నొప్పి, వాపు
ఇది కూడా చదవండి.. బంగాళదుంపలు-సైడ్ ఎఫెక్ట్స్..ఇవిగో..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
