ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

షేర్ చేయండి:
ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

సాక్షి లైఫ్ : డెంగ్యూ, వైరల్, చికున్‌గున్యా వల్ల వచ్చే జ్వరం కారణంగా శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్ విషయంలో, ప్లేట్‌లెట్ కౌంట్ గురించి ఎక్కువమంది బాధపడుతుంటారు. రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గితే ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు అని అంటున్నారు డాక్టర్లు. ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి, మందులు, చికిత్సతో కాకుండా, పలురకాల ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకోసం  ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటుచేసుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ప్లేట్‌లెట్స్..?

ప్లేట్‌లెట్స్ అంటే థ్రోంబోసైట్‌లు చిన్న రక్త కణాలు, ఇవి రక్తం గడ్డకట్టడంలో , రక్తస్రావం ఆపడంలో సహాయపడతాయి. దీని లోపం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. 

ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి, మందులు, చికిత్స కాకుండా, ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని మార్చడం, ఒత్తిడిని తగ్గించడం, హైడ్రేషన్ , ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. కొన్ని రకాల కూరగాయలు ప్లేట్‌లెట్లను పెంచడంలో సహాయపడతాయి.ప్లేట్‌లెట్స్ పెరగాలంటే ఏ కూరగాయలు తినాలో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 బ్రకోలీ.. 

బ్రకోలీలో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ "కే" రక్తం గడ్డకట్టడంలోనూ, అధిక రక్తస్రావం నివారించడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో బ్రకోలీని చేర్చుకోవడం ద్వారా ప్లేట్‌లెట్స్ స్థాయిలను పెంచుకోవచ్చు.
 
వెల్లుల్లి.. 

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ప్లేట్‌లెట్స్ ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి పనిచేసే యాంటీథ్రాంబోటిక్ లక్షణాలు ఇందులో  ఉన్నాయి.
పాలకూర.. 

ఇందులో ఐరన్, విటమిన్లు, ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడానికి, ప్లేట్‌లెట్ ఏర్పడటానికి సహాయపడుతుంది. పాలకూరను ఆహారంలో చేర్చుకుంటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. దీన్ని తినడం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది.
 
బీట్‌రూట్.. 

బీట్‌రూట్ లో చాలా పోషకాలున్నాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌లో అధిక మొత్తంలో నైట్రేట్‌లు , యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీని కారణంగా ప్లేట్‌లెట్స్ వేగంగా పెరుగుతాయి.
 
క్యారెట్.. 

క్యారెట్‌లో బీటా కెరోటిన్, విటమిన్ "ఏ" పుష్కలంగా లభిస్తాయి. దీన్ని తినడం వల్ల రక్తకణాలు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీ రోజువారీ ఆహారంలో క్యారెట్‌లను చేర్చుకోవడం ద్వారా ప్లేట్‌లెట్లను మెరుగుపరచవచ్చు. 
 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.