Causes, Remedies : గొంతు బొంగురుపోతోందా..? కారణాలు - పరిష్కారమార్గాలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గొంతు బొంగురుపోవడం, మాట స్పష్టంగా రాకపోవడం వంటి సమస్యలు సాధారణంగా జలుబు లేదా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి. అయితే, ఈ సమస్య దీర్ఘకాలం పాటు వేధిస్తుంటే మాత్రం తేలిగ్గా తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వరపేటిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు దారితీసే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్లు.. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల స్వరపేటిక వాపునకు గురవుతుంది. దీనినే 'లారింజైటిస్' అంటారు. గట్టిగా అరవడం, ఏకధాటిగా మాట్లాడటం లేదా పాడటం వల్ల స్వరపేటికపై తీవ్ర ఒత్తిడి పడి గొంతు మారుతుంది.

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

ప్రధాన కారణాలు ఏమిటి..? 

ఇన్ఫెక్షన్లు.. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల స్వరపేటిక వాపునకు గురవుతుంది. దీనినే 'లారింజైటిస్' అంటారు. గట్టిగా అరవడం, ఏకధాటిగా మాట్లాడటం లేదా పాడటం వల్ల స్వరపేటికపై తీవ్ర ఒత్తిడి పడి గొంతు మారుతుంది. జీర్ణాశయంలోని ఆమ్లాలు గొంతు పైభాగం వరకు రావడం వల్ల గొంతులో మంట, గొంతు కూర్చోవడం వంటివి జరుగుతాయి. సిగరెట్ పొగ, దుమ్ము, ధూళి కణాల వల్ల గొంతులో చికాకు మొదలై దీర్ఘకాలంలో వాయిస్ మారుతుంది. స్వరతంత్రులపై కణితులుఏర్పడటం కూడా వాయిస్ మారడానికి ఒక కారణం.

కనిపించే లక్షణాలు..

గొంతు నొప్పి, పొడిబారడం. తరచూ గొంతు సవరించుకోవాల్సి రావడం. మాట్లాడేటప్పుడు అలసటగా అనిపించడం, మాట మధ్యలో ఆగిపోవడం. ఆహారం మింగడంలో ఇబ్బంది లేదా దీర్ఘకాలిక దగ్గు.

ఉపశమనానికి జాగ్రత్తలు..

శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినన్ని నీళ్లు తాగాలి.

కొద్ది రోజుల పాటు గొంతుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. గట్టిగా మాట్లాడటం మానుకోవాలి. అలాగని గుసగుసలాడటం కూడా చేయకూడదు ఎందుకంటే ఇది కండరాలపై మరింత ఒత్తిడి పెంచుతుంది. పొగతాగే అలవాటును విడిచిపెట్టాలి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉంటే తగిన చికిత్స తీసుకోవాలి.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?

గొంతు బొంగురుపోవడం మూడు వారాల కంటే ఎక్కువ రోజులు వేధిస్తుంటే తప్పక ఈఎన్‌టీ (ENT) నిపుణులను సంప్రదించాలి. మెడలో గడ్డలు ఏర్పడటం, దగ్గులో రక్తం పడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకారణంగా బరువు తగ్గడం వంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్యులను కలవాలి.

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.