Best Foods : ఉదయం పూట ఈ ఆహారం తీసుకుంటే.. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు..!
సాక్షి లైఫ్ : ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది అల్పాహారాన్ని (Breakfast) నిర్లక్ష్యం చేస్తుంటారు లేదా హడావుడిగా టీ, బిస్కెట్లతో సరిపెట్టేస్తుంటారు. దీనివల్ల త్వరగా ఆకలి వేయడమే కాకుండా, రోజంతా నీరసంగా అనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం.. ఉదయం పూట కడుపునిండా పోషకాలతో కూడిన అల్పాహారం, మధ్యాహ్నం మితంగా భోజనం, రాత్రి వేళ తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. రోజంతా ఉత్సాహంగా, శక్తిమంతంగా పనిచేసుకోవడానికి ఉదయం పూట ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం..
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఓట్స్, గోధుమ రవ్వ..
ఉదయం పూట ఓట్స్ లేదా దలియా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ (fiber) పుష్కలంగా ఉంటాయి. ఇవి త్వరగా అరిగిపోకుండా, ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. వీటిని పాలు లేదా పెరుగు, డ్రై ఫ్రూట్స్, తాజా పండ్ల ముక్కలతో కలిపి తీసుకుంటే అదనపు పోషకాలు అందుతాయి. అయితే, రుచి కోసం చక్కెరను ఎక్కువగా వాడకపోవడం మంచిది.
ప్రొటీన్ తప్పనిసరి..
కండరాల ఆరోగ్యానికి, మెరుగైన జీవక్రియకు ప్రొటీన్ చాలా అవసరం. అందుకే మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడికించిన గుడ్లు, పాలు, పెరుగు, పనీర్, మొలకలు లేదా శనగపిండితో చేసిన అట్లు ఉండేలా చూసుకోండి. అల్పాహారంలో ప్రొటీన్ చేర్చడం వల్ల ఆహారం సమతుల్యంగా మారుతుంది.
పండ్లు, తృణధాన్యాలు..
యాపిల్, అరటి, జామ వంటి తాజా పండ్లలో విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. పండ్ల రసాలు తాగే కంటే, పండ్లను నేరుగా ముక్కలుగా తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ పూర్తిగా అందుతుంది. వీటితో పాటు బ్రౌన్ బ్రెడ్, కూరగాయలు ఎక్కువగా వేసిన అటుకులు, తృణధాన్యాలతో చేసిన రోటీలు మంచి ఎంపిక.
తగినంత నీరు.. కంటినిండా నిద్ర..
ఉదయం నిద్రలేవగానే తగినంత నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఉదయం పూట టీ, కాఫీలతో పాటు అధికంగా చక్కెర ఉండే బిస్కెట్లు, ప్యాకెట్ స్నాక్స్ తినడం మానుకోవాలి. పౌష్టికాహారంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం, రాత్రి వేళ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
