విటమిన్-B12 లోపిస్తే.. ఎలా అధిగమించాలి.
సాక్షి లైఫ్ : ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ B12 ఒకటి. ఈ విటమిన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐతే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆ లోపాన్ని అధిగమించవచ్చు. విటమిన్ బి12ని పొందాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు అవసరమో తెలుసుకోండి.
విటమిన్ బి12 లోపం వల్ల కళ్లు తిరగడం, చూపు మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.దీని లోపం వల్ల నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి, ఆహారంలో పాలు, గుడ్లు, బచ్చలికూర వంటివి తీసుకోవాలి. విటమిన్ బి12 డెఫీసెన్సీ కారణంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు సంభవిస్తాయి. విటమిన్ బి 12 లోపిస్తే ఒక్కోసారి ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశం ఉంది.
విటమిన్ బి12 లోపాన్ని భర్తీ చేసే ఆహార పదార్థాలు..
గుడ్లు..
విటమిన్ బి12 గుడ్లలో లభిస్తుంది. కాబట్టి, దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ బి12 ఉంటుంది.
పాలు..
విటమిన్ B12కి పాలు అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు. పాలలోని పోషకాలు ఆరోగ్యం మొత్తానికి మేలు చేస్తాయి. కాబట్టి విటమిన్ B12 లోపం ఉన్నవాళ్లు తమ ఆహారంలో పాలను చేర్చుకోవడం మంచిది.
చేప..
ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తోపాటు విటమిన్ బి12 కూడా ఉంటుంది. అందువల్ల, మీ ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి12 లోపం నుంచి బయటపడొచ్చు.
తృణధాన్యాలు..
తృణధాన్యాల్లో విటమిన్ B12 ఉంటుంది. అంతేకాదు శరీరానికి కావాల్సిన బలవర్థకమైన ఆహారం కూడా అందుతుంది.
మాంసాహారాల్లో..
చికెన్ , బీఫ్, ఫోర్క్ వంటి మాంసాహారాల్లో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది.
పాలకూర..
ఇందులో విటమిన్ బి12 లభిస్తుంది. దీనితో పాటు, ఆరోగ్యానికి అవసరమైన ఐరన్,ఇతర పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. అందుకే పాలకూరను మీ ఆహారంలో భాగం చేసుకోండి.
ఇది కూడా చదవండి.. మంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
